Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.బి.ఐ సర్వర్ డౌన్... ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం!

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (15:52 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) సర్వర్ డౌన్ అయింది. దీంతో ఆ బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడినట్టు ప్రచారం జరుగుతోంది. యూపీఐ లావాదేవీలు, నెట్‌ బ్యాంకింగ్‌, అధికారిక యోనో యాప్‌.. వినియోగంలో సమస్యలు తలెత్తుతున్నట్లు పలువురు కస్టమర్లు సోషల్‌ మీడియా వేదికగా తమ అసౌకర్యాన్ని తెలియజేశారు.
 
ఔటేజ్‌ ట్రాకింగ్ వెబ్‌సైట్‌ డౌన్‌ డిటెక్టర్‌ ఇండియా సైతం ఎస్‌బీఐ కస్టమర్లు సమస్యను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. సోమవారం ఉదయం దాదాపు 9 గంటల నుంచి కస్టమర్ల ఫిర్యాదులు ప్రారంభమైనట్లు తెలిపింది. కొంత మంది మాత్రం ఆదివారం నుంచే తాము సమస్య ఎదుర్కొంటున్నట్లు ట్విటర్‌లో రాసుకొచ్చారు. మరికొందరైతే రెండు, మూడు రోజుల నుంచి తాము ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
 
ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఎస్‌బీఐ తమ ఆన్‌లైన్‌ సేవలకు ఏప్రిల్‌ ఒకటో తేదీన స్వల్ప విరామం ఇచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 4:45 వరకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి ఎస్.బి.ఐ సేవలకు అంతరాయం ఏర్పడుతున్నాయి. 
 
మరోవైపు, సోమవారం బ్యాంకు సేవల అంతరాయంపై ఎస్‌బీఐ ఉన్నతాధికారులు మాత్రం స్పందించలేదు. దీనిపై కస్టమర్లు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు సేవల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తారని ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments