Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం మీసం తిప్పడం తర్వాత కానీ.. ఇక పొదుపులు మర్చిపోవలసిందే.

లక్షల కోట్లు ప్రజలనుంచి లాక్కుని బ్యాంకుల్లో కుమ్మరించండి. అయినా అవి జనాలకు ఏమాత్రం మేలు కలిగించకపోగా జీవితమంతా కష్టపడుతూ సంపాదించి ఖాతాదారులు పొదుపు చేసిన మొత్తాలకు ఇస్తున్న కనీస వడ్డీ రేట్లను కూడా తగ్గించడంలో మన బ్యాంకులను మించినవి ప్రపంచంలోనే ఉండ

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (03:55 IST)
లక్షల కోట్లు ప్రజలనుంచి లాక్కుని బ్యాంకుల్లో కుమ్మరించండి. అయినా అవి జనాలకు ఏమాత్రం మేలు కలిగించకపోగా జీవితమంతా కష్టపడుతూ  సంపాదించి ఖాతాదారులు పొదుపు చేసిన మొత్తాలకు ఇస్తున్న కనీస వడ్డీ రేట్లను కూడా తగ్గించడంలో మన బ్యాంకులను మించినవి ప్రపంచంలోనే ఉండవని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు లక్షల కోట్ల మేరకు డిపాజిట్లు వచ్చి పడ్డాయి. తమ వద్ద ఉన్న పెట్టుబడులపై సాధించే లాభాలను తమ ఖాతాదారులకు మేలు కలిగించడం కంపెనీల విధి. కాని అలాంటివి తమ ముందు బలాదూర్ అంటున్నాయి. భారతీయ బ్యాంకులు.

 
 
ఇప్పటికే ఖాతాదారులు చేసే ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీలను గణనీయంగా తగ్గించి దెబ్బకొట్టిన బ్యాంకులు ఇప్పుడు వారి ఖాతాలలో ఉండే సేవింగ్స్‌పై కూడా కోత పెట్టనున్నాయి. ఎందుకంటే కోట్ల డిపాజిట్లు తమ వద్ద పోగుపడినా రుణాల జారీ బాగా తగ్గిపోవడంతో  నిర్వహణ లాభాలను పెంచుకునేందుకు బ్యాంకులు ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాల్లో నిల్వ చేసే మొత్తాలపై వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనలో ఉన్నాయి. దేశంలో చాలా బ్యాంకులు ఇప్పుడు పొదుపు ఖాతాల్లో నిల్వలపై 4 శాతం వడ్డీని అందిస్తుండగా కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం లక్షకు మించి సేవింగ్స్ ఖాతాల్లో ఉంచిన నిల్వలపై 6 శాతం పైనే వడ్డీ రేటును అందిస్తున్నాయి. యెస్‌ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు, డీబీఎస్‌ బ్యాంకు తదితర బ్యాంకులు ఈ కోవకు చెందుతాయి. 
 
పొదుపు ఖాతా గుండెకాయ. దాన్నే దెబ్బ కొడుతున్నారు
మన దేశంలో చాలామంది ప్రజలకు తక్కువకాలంలో మంచి రాబడినిచ్చే పొదుపు సాధనాలగురించి చాలా తక్కువగా తెలియడంతో వీరందరూ బ్యాంకు ఖాతాల్లోనే తమ డబ్బు పొదుపు చేస్తుంటారు. ఇవి వెయ్యి రూపాయల నుంచి లక్ష, రెండు లక్షల రూపాయల వరకు కూడా ఉండవచ్చు. ఇలా నెలల తరబడి వీరు ఉంచే నిల్వలకు బ్యాంకులు ఇప్పుడు 4 శాతం వడ్డీని ముష్టిగా అందిస్తున్నాయి. గతంలో అంటే ఆర్బీఐ గవర్నర్ డి. సుబ్బారావు సేవింగ్స్‌ ఖాతాలపై సమంజసమైన వడ్డీ రేటు ఉండాలని యోచించి నియంత్రణ ఎత్తివేశారు. 
 
అయినప్పటికీ చాలావరకు బ్యాంకులు నామమాత్రపు పెంపుతో 4 శాతానికి వడ్డీ రేటును పరిమితం చేశాయి. ఇప్పుడు ఆ కాస్త వడ్డీరేటును కూడా తగ్గించాలనే కుట్రలు జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల్లోకి భారీగా నగదు నిల్వలు వచ్చి చేరాయి. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల పైనే పెద్ద నోట్ల రూపంలో బ్యాంకుల్లో జమ అయ్యాయి. ఇలా డిపాజిట్లు పెరిగినందున బ్యాంకులు ఖాతాదారులకు వడ్డీ చెల్లించాల్సి ఉంది. కాని రుణాల్లో అనుకున్న మేర వృద్ధి లేకపోవడంతో నిర్వహణ నష్టాలు వచ్చే ప్రమాదాన్ని ఊహించి ముందుగానే బ్యాంకులు పావులు కదుపుతూ సేవింగ్స్ ఖాతాల నిల్వలపై ఇప్పుడున్న నామమాత్రపు వడ్డీ రేట్లను కూడా తగ్గించాలని ఆలోచిస్తున్నాయి.
 
అదే జరిగితే దేశంలోని కోట్ల మందికి తాము చేసిన పొదుపు నిల్వలపై వచ్చే కాసింత వడ్డీ కూడా రాదు. ఖాతాదారులకు మేలు కలిగించే వ్యవస్థలు ఈ దెబ్బతో పూర్తిగా అదృశ్యం కానున్నాయి. ఇక దేశాన్ని దేవుడే కాపాడాలి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments