Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు తీయాలన్నా.. వేయాలన్నా బాదిపడేస్తాం.. రారమ్మంటున్న ఎస్‌బీఐ

ఇన్నాళ్లూ ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే అతి తక్కువ చార్జీలతోనూ, లేదా దాదాపు ఉచితంగానూ లావాదేవీలకు వీలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ బాదుడు మొదలెట్టేసింది. మామూలు బాదుడు కాదు. ఇకపై మీరు నెలకు మూడుసార్లకు మించి బ్యాంకు శాఖకు వెళ్లి డబ్బులు డిపాజిట

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (05:45 IST)
ఇన్నాళ్లూ ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే అతి తక్కువ చార్జీలతోనూ, లేదా దాదాపు ఉచితంగానూ లావాదేవీలకు వీలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ బాదుడు మొదలెట్టేసింది. మామూలు బాదుడు కాదు. ఇకపై మీరు నెలకు మూడుసార్లకు మించి బ్యాంకు శాఖకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేసి చూడండి. ఏటీఎంలో ఐదు లావాదేవీలకు మించి చేయండి. చెక్ బుక్ కావాలని ఆర్జీ పెట్టండి.. ఆ బాదుడు ఏ స్థాయిలో  ఉంటుందో మీకే తెలుస్తుంది.
 
కోర్టు గోడ పక్కన నిలుచున్నా సరే.. డబ్బు తీయ్ అంటుందని మన న్యాయస్తానాల భారిన పడి కొంప గుల్ల చేసుకున్న వారు చెబుతుంటారు. ఇప్పడు బ్యాంకు గోడ పక్కన నిలబడినా నా నీడలో నిలబడ్డావు చార్జీలు కట్టు అనే స్థాయికి బ్యాంకులు తయారైపోయాయి. ఏప్రిల్ 1 నుంచి పెంచిన చార్జీలను మార్చిన నిబంధనలను చూస్తే ఎస్బీఐ వద్దకు పోవాలంటే భయం వేయక తప్పదు. ఎస్‌బీఐ బాటలోనే మిగిలిన ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా నడిచే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అదే జరిగితే ఖాతాదారులు లబోదిబోమనాల్సిందే.
 
సేవింగ్స్‌ ఖాతాదారులు నెలలో మూడు సార్లు మాత్రమే తమ బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఆపై ప్రతీ డిపాజిట్‌కు గాను రూ.50, దీనికి సేవా రుసుము కలిపి చెల్లించుకోవాలి. రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంతకు మించితే ప్రతీ రూ.1,000పై 75 పైసల చార్జీ ఉంటుంది. ఈ చార్జీ కూడా కనీసం రూ.50 తక్కువ కాకుండా వసూలు చేస్తారు. నెలలో సొంత బ్యాంకు ఏటీఎంలలో ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఆపై ప్రతీ లావాదేవీపై రూ.10 చార్జీ విధిస్తారు. ఇతర బ్యాంకు ఏటీఎంల్లో మూడుకు మించితే ప్రతీ లావాదేవీపై రూ.20 చొప్పున వడ్డన ఉంటుంది. 
 
ఖాతాలో కనీస నగదు నిల్వ రూ.25 వేలు ఉంచితే సొంత బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలపై చార్జీలు పడవు. అదేవిధంగా రూ.లక్ష బ్యాలన్స్‌ నిర్వహిస్తే ఇతర బ్యాంకుల ఏటీఎంల్లోనూ లావాదేవీలు ఉచితం. లాకర్‌ అద్దె కూడా పెరిగిపోయింది. అలాగే, ఏడాదిలో 12 సార్లు మాత్రమే ఉచితంగా లాకర్లను తెరిచేందుకు అనుమతి. ఆపై ప్రతిసారీ రూ.100 చెల్లించుకోవాల్సిందే. కరెంటు ఖాతాదారులకు ఏడాదిలో 50 చెక్కులే ఉచితం, ఆపై ప్రతీ చెక్‌లీఫ్‌పై రూ.3 చార్జీ ఉంటుంది. ఖాతా ప్రారంభం ఉచితం కాదు. రూ.20 చెల్లించుకోవాలి.
 
ఎస్‌బీఐలో కొత్తగా విలీనమైపోయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్, భారతీయ మహిళా బ్యాంకు కస్టమర్లు సైతం ఈ చార్జీల భారాన్ని ఎత్తుకోక తప్పదు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments