Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారులకు ఎస్.బి.ఐ శుభవార్త.. గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (17:32 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. గృహరుణాలు తీసుకునేవారికి 6.7 శాతానికే రుణాలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. అంతేకాదు ఎంత రుణం తీసుకున్నప్పటికీ ఇదే వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. ఇలా ఒకే రేటుకు హోంలోన్లు ఇవ్వ‌డం ఇదే తొలిసారి. 
 
అంతేకాదు ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. దేశంలో పండుగ‌ల సీజ‌న్‌కు ముందు ఇళ్లు కొనాల‌నుకుంటున్న వారిని ఆక‌ర్షించ‌డానికి ఎస్‌బీఐ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇది ఎలా ల‌బ్ధి చేకూర్చ‌నుందో కూడా బ్యాంకు వివ‌రించింది.
 
గ‌తంలో ఉద్యోగుల‌కు, ఉద్యోగేత‌రుల‌కు వేర్వేరు వ‌డ్డీ రేట్లు ఉండేవి. ఉద్యోగేత‌రులైతే ఎక్కువ వ‌డ్డీ చెల్లించాల్సి వ‌చ్చేది. ఈ తాజా నిర్ణ‌యం వ‌ల్ల ఉద్యోగేత‌రులు కూడా త‌మ వ‌డ్డీ రేటుపై 15 బేసిస్ పాయింట్లు ఆదా చేసుకోవ‌చ్చు అని బ్యాంక్ చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments