Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 కోట్ల కార్డుల మైలురాయిని చేరుకున్న ఎస్‌బీఐ కార్డ్

ఐవీఆర్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (22:07 IST)
భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యేక క్రెడిట్ కార్డు జారీదారు అయిన ఎస్‌బీఐ కార్డ్ 2 కోట్ల కార్డుల మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా వినూత్న పరిష్కారాలను అందించడం, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడంపై తమ నిబద్ధతను ఈ మైలురాయి హైలైట్ చేస్తుంది. ఈ ఘనత భారతదేశంలోని క్రెడిట్ కార్డు రంగంలో ఎస్‌బీఐ కార్డ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు, 'డిజిటల్ ఇండియా యొక్క కరెన్సీ' అనే వాగ్దానాన్ని నిలబెడుతున్నట్లు తెలుపుతుంది.
 
ఎస్‌బీఐ కార్డ్ 1998లో ప్రారంభమైన నాటి నుండి విభిన్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన విస్తృతమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టడంలో ముందంజలో ఉంది. కోర్ కార్డుల నుండి ప్రీమియం బ్రాండ్‌లతో కో-బ్రాండెడ్ భాగస్వామ్యాలు, రివార్డ్ ఆధారిత మరియు లైఫ్‌స్టైల్-కేంద్రీకృత ఆఫర్‌ల వరకు, కస్టమర్-ఫోకస్డ్ ఇన్నోవేషన్‌లో ఎస్‌బీఐ కార్డ్ ఇండియన్ క్రెడిట్ కార్డ్ రంగానికి కొత్త ప్రమాణాలను స్థాపించింది.  2019 నుండి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య, 25% కాగ్ర (CAGR) కార్డుల సంఖ్య పెరుగుదల మరియు 26% కాగ్ర వ్యయాల్లో పెరుగుదలను సాధించింది. 
 
"ఎస్‌బీఐ కార్డ్ బ్రాండ్ మా ‘మెక్ లైఫ్ సింపుల్’ విలువ ప్రాతిపదికగా నిలిచింది. 2 కోట్ల కార్డుల మైలురాయిని చేరుకోవడం మా కస్టమర్లు మనపై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి నిదర్శనం. ఇది మా వినూత్నత, అధిక స్థాయి కస్టమర్ సర్వీస్, సురక్షితమైన, సౌకర్యవంతమైన చెల్లింపుల పరిష్కారాలను అందించాలన్న దృష్టికి ప్రతీక. మేము వినియోగదారుల అభిరుచుల ఆధారంగా మరింత విలువను అందించడానికి కట్టుబడి ఉన్నాం."ఎస్‌బీఐ కార్డ్ ఎండీ మరియు సీఈఓ అభిజిత్ చక్రవర్తి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments