Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త కరెన్సీ నోట్లలో నానో చిప్ పెట్టాలనుకున్నాంగానీ... ఆర్బీఐ అధికారి వివరణ

భారత రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన రూ.500, రూ.2000 నోట్లలో చిప్ పెట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిప్ పెట్టడం వల్ల నకిలీ కరెన్సీని తయారు చేయడం వీలు పడదనీ, అలాగే, భారీ మొత్తంలో ఈ కరెన

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (17:17 IST)
భారత రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన రూ.500, రూ.2000 నోట్లలో చిప్ పెట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిప్ పెట్టడం వల్ల నకిలీ కరెన్సీని తయారు చేయడం వీలు పడదనీ, అలాగే, భారీ మొత్తంలో ఈ కరెన్సీ నోట్లను నిల్వ చేయడం సాధ్యపడదనే వార్తలు ఉన్నాయి. 
 
నవంబర్ 8వ తేదీ తర్వాత కొన్ని రోజుల పాటు ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకున్నారు. కొత్త నోట్లు అందుకున్న వారైతే... చిప్ ఎక్కడ పెట్టారో అంటూ నోటును నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాత నోటులో ఎలాంటి చిప్ పెట్టలేదని ఆర్బీఐ అధికారులు వెల్లడించడంతో అందరూ సైలెంటయిపోయారు. 
 
ఈ నేపథ్యంలో చిప్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఆర్బీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. కొత్త నోట్లలో నానో చిప్‌లు లేదా పార్టికిల్స్ (కణాలు) పెట్టాలనుకున్న విషయం వాస్తవమేనన్నారు. అయితే, అది అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు ఆయన బెంగళూరులో తెలిపారు. అంతేకాదు, ఆ నోట్లను తనిఖీ చేయాలంటే ప్రత్యేక స్కానింగ్ పరికరాలు కావాలని... అది మరింత ఆర్థిక భారం కావడంతో పూర్తిగా వెనకడుగు వేశామని చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments