Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 2,36,966 బైక్‌లను రీకాల్‌ చేసిన కంపెనీ, ఎందుకంటే?

Webdunia
గురువారం, 20 మే 2021 (20:26 IST)
ప్రీమియం బైక్‌ల దిగ్గజం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మోడళ్లకు చెందిన 2,36,966 బైక్‌లను రీకాల్‌ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో మెటియర్‌ 350, క్లాసిక్‌ 350, బుల్లెట్‌ 350 మోడళ్లకు చెందిన బైక్‌లు ఉన్నాయి. భారత్‌, థాయ్‌లాండ్‌, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌.. మొత్తం ఏడు దేశాల నుంచి బైక్‌లను రీకాల్‌ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. 
 
ఇంజిన్‌లోని ఇగ్నిషన్ కాయిల్‌లో లోపాన్ని గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. దీనివల్ల ఇంజిన్‌ మిస్‌ఫైర్‌, పనితీరు తగ్గడం, ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వంటి సమస్యలు చాలా అరుదుగా తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఈ లోపాలున్న కాయిల్‌ తయారీలో ఉపయోగించిన వస్తువులను ఓ సప్లయర్‌ దగ్గరి నుంచి తీసుకున్నామని తెలిపింది. వాటిల్లో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు అంతర్గతంగా జరిపిన పరీక్షల్లో తేలిందని పేర్కొంది. డిసెంబరు 2020, ఏప్రిల్‌ 2021 మధ్య తయారైన బైక్‌లలోనే ఈ సమస్య ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలోనే ఆయా బైక్‌లను రీకాల్‌ చేసి లోపాల్ని సవరిస్తున్నట్లు సంస్థ వివరించింది. వీటిలో కేవలం ఒక 10 శాతం బైక్‌లకు మాత్రమే కాయిల్‌ రీప్లేస్‌మెంట్‌ అవసరం అయి ఉండొచ్చని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments