Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో నీరవ్ మోడీ... రూ.800 కోట్ల రుణాలతో రోటామాక్ అధినేత పరారీ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) స్కామ్ తరహాలోనే కాన్పూర్‌లోని ప్రభుత్వరంగ బ్యాంకులూ రూ.800 కోట్లకుపైగా చేతి చమురు వదిలించుకున్నాయి. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (10:07 IST)
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) స్కామ్ తరహాలోనే కాన్పూర్‌లోని ప్రభుత్వరంగ బ్యాంకులూ రూ.800 కోట్లకుపైగా చేతి చమురు వదిలించుకున్నాయి. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ రుణాన్ని తీసుకున్న రోటామాక్‌ (కలాల తయారీ) కంపెనీ అధినేత విక్రమ్‌ కొఠారీ దేశం విడిచి పారిపోయినట్టు సమాచారం. 
 
ఈయన అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా... ఈ అయిదు బ్యాంకులూ కొన్ని నిబంధనల్ని అతిక్రమించి మరీ రుణాలు ఇచ్చినట్టు సమాచారం.  
 
ముంబైలోని యూనియన్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.485 కోట్లు, కోల్‌కతాలోని అలహాబాద్‌ బ్యాంక్‌ నుంచి రూ.352 కోట్లు తీసుకుని, ఏడాది తర్వాత కూడా అసలు గానీ, వడ్డీగానీ కొఠారీ చెల్లించలేదు. దీంతో రోటోమాక్‌ గ్లోబల్‌ ప్రై.లి. సంస్థని 'ఉద్దేశపూర్వక ఎగవేతదారు'గా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గత యేడాది ప్రకటించింది.
 
పైగా, కాన్పూర్‌ సిటీసెంటర్‌ రోడ్లోని కార్యాలయం వారం రోజులుగా మూతపడే ఉంది. అప్పటినుంచి అధినేత ఆచూకీ తెలియరావడంలేదు. కొఠారీ కూడా నీరవ్‌ మోదీ మాదిరిగా విదేశాలకు చెక్కేసినట్లు అనుమానాలు నెలకొన్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments