Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెవెరీ వారి అనువాదక్ 2.0 డైనమిక్ వెబ్‌సైట్‌లలో వినియోగదారు సంపూర్ణ వీక్షణకి వీలు

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (23:33 IST)
రెవరీ లాంగ్వేజ్ టెక్నాలజీస్ జూన్ 2020 తొలినాళ్ళలోనే అనువాదక్ యొక్క మొదటి వెర్షన్‌ను ఆవిష్కరించింది. అనువాదక్ అనేది బహుభాషా వెబ్‌సైట్ నిర్వహణ వేదిక, ఇది వెబ్‌సైట్‌ను ఏదైనా భాషలో స్థానికీకరించడం, నిర్వహించటం, ప్రచురించడం మరియు ప్రారంభించడం వంటి ప్రక్రియను సులభతరం చేస్తుంది. దీని సహాయంతో వెబ్‌సైట్‌ను స్థానికీకరించే సమయాన్ని 40 % వరకు తగ్గించవచ్చు మరియు స్థానికీకరణ మరియు విషయాంశాల నిర్వహణ ఖర్చులో 60 % వరకు ఆదా చేయవచ్చు.
 
సాంప్రదాయకంగా, భారతీయ భాషలలో డైనమిక్ వెబ్‌సైట్ స్థానికీ కరణ మరియు విషయాంశాల నిర్వహణలు, ఈ ఆరు ప్రక్రియలను కలిగి ఉంటాయి, ఇవి మ్యాన్యువల్‌గా నిర్వహించబడడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి:
 
మూలంగా ఉన్న ఇంగ్లీష్ వెబ్‌సైట్ నుండి నిశ్చలమైన ఆంగ్ల విషయాంశాలను సంగ్రహించడం.
మార్చాల్సిన అన్ని ఆంగ్ల విషయాంశాల యొక్క స్ప్రెడ్‌షీట్‌ను నిర్వహించడం.
ప్రతి భారతీయ భాషలో వేర్వేరు సర్వర్లలోని వెబ్‌సైట్‌లను అమలు చేయడం మరియు నిర్వహించడం.
ఒకసారి వెబ్‌సైట్ హోస్ట్ చేయబడిన తర్వాత, స్థానికీకరించిన విషయాంశాలు ప్రతిఒక్క వ్యక్తిగత వెబ్‌సైట్‌లలో నవీకరించబడడం.
డేటాబేస్ లేదా బ్యాకెండ్ నుండి సంగ్రహించబడిన విషయాంశాలన్నీ మ్యాన్యువల్‌గా స్థానికీకరించబడడం.
ఈ బహుభాషా వెబ్‌సైట్‌లతో లైవ్‌లో అనుసరించడం మరియు ప్రతి వెబ్‌సైట్‌కు విడిగా ఎస్.ఈ.ఓని నిర్వహించడం.
మూలంగా ఉన్న ఆంగ్ల వెబ్‌సైట్‌లోని ఏదైనా మార్పులు అదేరకమైన దీర్ఘకాలిక ప్రక్రియ ద్వారా చేయవలసి ఉంటుంది.
 
స్థానికీకరించిన వెబ్‌సైట్‌ల కోసం సంబంధిత విషయాంశాలను అనువదించడం, నిర్వహించడం మరియు ప్రమాణీకరించడం వంటివాటిని, అనువాదక్ ఒక వేదికగా ఆటోమేట్ చేస్తుంది. స్థానికీకరించిన విషయాంశాలు, వెబ్‌సైట్ మరియు పురోగతిని ట్రాక్ చేయడం సాధారణ యూజర్ డాష్‌బోర్డ్ ద్వారా అవరోధరహితంగా చేయడం. ఇది లైవ్ గా అనుసరించడానికి పట్టే సమయాన్ని తగ్గించడమే కాక, అదే సమయంలో ఖర్చులను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.
 
రెవెరీ లాంగ్వేజ్ టెక్నాలజీస్ సీఈఓ ఆర్‌వింద్ పాణి, ఇలా అన్నారు, "మేము వోకల్‌ ఫర్‌ లోకల్‌లో నొక్కి చెప్పినట్లుగా, వ్యాపారాలు మరియు ప్రభుత్వాలు అన్ని భారతదేశానికి చేరుకోవడానికి సరైన సాధనాలతో సాధికారత పొందడం అత్యవసరం. 536 మిలియన్ భారతీయ-భాషా ఇంటర్నెట్ వినియోగదారులను సంభావ్యంగా ఆకర్షించడానికి ఈ అనువాదక్ ఒక ప్రయత్నం. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్న రెవెరీతో, అనువాదక్ ఒక సమగ్ర డిజిటల్ ఇండియాను నిర్మించడంలో పురోగతివైపు దూసుకెళుతుంది."
 
రెవెరీ వారి అనువాదక్2.0తో, ఇకామర్స్ సైట్స్ వంటి డైనమిక్ వెబ్‌సైట్‌లలో మొత్తం వినియోగదారు వీక్షణను ఇప్పుడు స్థానికీకరించవచ్చు: ఎఐ - ఎనేబుల్డ్ అనువాద నిర్వహణ వేదికలతో కలిసిపోయే అనువాదక్ యొక్క సామర్థ్యం వెబ్‌సైట్ అనువాద సమయాన్ని భారతీయ భాషలలో సాంప్రదాయకంగా అనువదించడానికి పట్టే సమయంలో మూడవ వంతుకు తగ్గిస్తుంది.
 
రెవెరీ యొక్క సొంత యాజమాన్య ఇన్-బిల్ట్ ఇండిక్ ఫాంట్లతో - అనువాదక్ ద్వారా పంపిణీ చేయబడిన అనువాదాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.
కొత్త భాషలను ఆవిష్కరించడానికి కోడింగ్ అవసరం లేకుండా ఐ.టి పై ఆధారపడడాన్ని అనువాదక్ తగ్గిస్తుంది.
ఇండిక్ లాంగ్వేజ్ ప్లగ్ - ఇన్‌ల ఆన్-డిమాండ్ మాదిరిగా కాకుండా, అనువాదక్, స్థానికీకరించిన వెబ్‌పేజీలకు. ఎస్. ఈ. ఓ.  అనుకూలతను నిర్ధారిస్తుంది, అంటే ఒక సంస్థ యొక్క స్థానికీకరించిన వెబ్‌సైట్ అన్వేషణ ప్రశ్నలను వారి స్వంత భాషలో వేగంగా చూపించడం ప్రారంభిస్తుంది.
ఇకామర్స్ సైట్లు, సోషల్ మీడియా ఫీడ్స్, రియల్ టైమ్ న్యూస్ ఫీడ్స్, స్టాక్ నవీకరణల వంటి డైనమిక్ విషయాంశాల స్థానికీకరణ ఇప్పుడు అదే సమయంలో అవరోధరహితంగా సాధ్యమవుతుంది.
సైట్ లేదా పేజీ అందించబడుతున్నప్పుడు, దానిలో కొత్తగా కనిపించే విషయాంశాలు కూడా తదనుగుణంగా స్థానికీకరించబడతాయి.
సర్వర్ కాల్స్‌పై ఆధారపడకుండా బ్రౌజర్‌లోనికి స్వీకరించడం మరియు చేయడం అనేవి ఈ రకమైన స్థానికీకరణద్వారా ఎంతో సులభం, అంటే వ్యాపారాలు ఇప్పటి కంటే ఎక్కువ బహుభాషల ద్వారా వేగంగా చొచ్చుకుపోతుందని అర్థం
ఇప్పుడు అనుకూలమైన టైమ్‌లైన్‌తో భాషల - వారీగా, లోతైన విశ్లేషణలు కూడా అందుబాటులో ఉన్నాయి.
రెవెరీ లాంగ్వేజ్ టెక్నాలజీల గురించి
 
భారతీయ భాషల కోసం స్థానికీకరణ విభాగంలో ప్రారంభం-నుండి-ముగింపు వరకు, లాంగ్వేజ్ సాంకేతికత ఉత్పత్తులు మరియు సేవలను అందించే ఏకైక సంస్థ రెవెరీ లాంగ్వేజ్ టెక్నాలజీస్. వారు టెక్స్ట్ మరియు వాయిస్ సొల్యూషన్స్ రెండింటి కోసం భారతీయ భాషల కోసం అనేక రకాల భాషా సాంకేతిక ఉత్పత్తులను విస్తృత స్థాయిలో అందిస్తారు, వీటిలో:
 
యంత్ర అనువాదం మరియు లిప్యంతరీకరణ సాంకేతికతలు ప్రత్యేకంగా భారతీయ భాషల కోసం సుశిక్షితమయ్యాయి మరియు నిర్మించబడ్డాయి,
వెబ్‌సైట్ స్థానికీకరణ,
శాస్త్రీయంగా రూపొందించబడిన బహుభాషా టెక్స్ట్ డిస్ప్లే సూట్‌,
ఖచ్చితమైన వ్యాపార అనువాదాలకు సహాయపడే పరిశ్రమ - నిర్దిష్ట భారతీయ భాషా పదావళులు,
ఫోనెటిక్ టైపింగ్‌కు మద్దతు ఇచ్చే బహుభాషా కీప్యాడ్‌ల వంటి సులభమైన ఇన్పుట్ ఉత్పత్తులు,
బహుభాషా శోధన మరియు ఖచ్చితమైన తదుపరి పదం అంచనాలు,
స్వయంచాలక ప్రసంగం-నుండి-వచనం మరియు వచనం-నుండి- ప్రసంగం మార్పిడి మరియు మరిన్నో.
 
రెవెరీ లాంగ్వేజ్ టెక్నాలజీస్ వెబ్‌సైట్లు, అనువర్తనాలు ( మొబైల్ / వెబ్ ), చాట్‌బోట్స్, కమ్యూనికేషన్స్ ( ఎస్. ఎమ్. ఎస్, పుష్ నోటిఫికేషన్‌లు ), ఐ.వి.ఆర్.ఎస్, చాట్‌బోట్స్, వాయిస్ బోట్స్ మరియు మరిన్ని డిజిటల్ సంపదలను శక్తివంతం చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments