Webdunia - Bharat's app for daily news and videos

Install App

చమురు వ్యాపార రంగంలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి, డిసెంబరుకు 4G... ముకేష్ అంబానీ

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2015 (16:31 IST)
పెట్రో కెమికల్ వ్యాపార రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ శుక్రవారం వెల్లడించారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ... పెట్రో కెమికల్ బిజినెస్‌లో పెట్టుబడితోపాటు 4జి టెలికం సేవలను కూడా ఈ ఏడాది డిసెంబరుకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 
 
కాగా ఆయా రంగాల్లో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి వస్తాయని చెప్పారు. వార్షిక సాధారణ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు క్రూడ్ ఆయిల్ రిఫైనింగులో ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. సుమారు గంటపాటు ప్రసంగించిన ముఖేష్, రిల్ భవిష్యత్ కార్యాచరణలను వివరించారు.
 
సంస్థ ఈ ఏడాది రూ. 18, 746 కోట్లను కస్టమ్స్, ఎక్సైజ్ పన్నుల రూపేణా చెల్లించినట్లు తెలిపారు. ఈ మొత్తం భారతదేశ ఆదాయంలో 5% కావడం గమనార్హం. ఇంకా రూ. 6,124 కోట్లను పన్నుల రూపేణా చెల్లించడం ద్వారా ప్రైవేట్ సెక్టార్లో అత్యధిక పన్నులు చెల్లించే సంస్థగా రిలయన్స్ ఉంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments