Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ బస్ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (18:48 IST)
రెడ్ బస్ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్ వ్యవహరించబోతున్నారు. త్వరలో టీవీ, సినిమా, డిజిటల్, సోషల్ మీడియా, ఓఓహెచ్ ఫ్లాట్‌ఫామ్‌లతో పాటు పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకుగాను అల్లు అర్జున్‌ను రంగంలోకి దించనుంది. 
 
ఈ క్రమంలో ఆన్‌లైన్ బస్ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ అయిన రెడ్ బస్ తన అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ప్రకటించింది. పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ద్వారా  దేశవ్యాప్తంగా రెడ్ బస్ కస్టమర్లకు ఈజీగా కనెక్ట్ అవుతారని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 
 
గతంలో అర్జున్ 2017లో  రెండు సంవత్సరాల పాటు రెడ్ బస్ అంబాసిడర్‌గా  విధులు నిర్వర్తించాడు. రెండేళ్ల విరామం తర్వాత రెడ్ బస్ మళ్లీ అల్లు అర్జున్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడానికి ప్రధాన కారణం పుష్ఫ సినిమానే. 
 
ఈ సినిమా అల్లు అర్జున్‌ను పాన్ వఇండియా స్టార్‌గా మార్చింది. పుష్పగా అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ ఫ్యాన్స్ బలంతోనే ప్రస్తుతం రెడ్ బస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా అతనిని ఎంచుకుని క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. 
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, "మళ్లీ రెడ్ బస్సుతో పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది మిలియన్ల మందితో నిమగ్నం అయ్యే బ్రాండ్, ప్రజలను వారి గమ్యస్థానాలకు కనెక్ట్ చేస్తుందన్నారు.  
 
అలాగే రెడ్ బస్ సీఈఓ ప్రకాశ్ సంగం మాట్లాడుతూ "అల్లు అర్జున్‌తో మా మునుపటి అనుబంధం మాకు అద్భుతంగా పనిచేసిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments