Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ-కెనరా బ్యాంక్‌‌లపై రూ.2కోట్ల జరిమానా విధించిన ఆర్బీఐ

సెల్వి
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (19:53 IST)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), కెనరా బ్యాంక్‌లపై సీరియస్ అయ్యింది. బ్యాంకింగ్ నిబంధనలు, ఆర్‌బిఐ ఆదేశాలను ఉల్లంఘించిన కారణంగా ఎస్బీఐ, కెనరా బ్యాంక్‌లపై జరిమానాలు విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సోమవారం ప్రకటించింది.  
 
బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్‌ను పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ.2కోట్ల జరిమానా విధించింది.
 
రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్ అలాగే ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్‌ను పరిశీలించినప్పుడు, కొన్ని కంపెనీల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తంలో ఎస్‌బిఐ షేర్లను తాకట్టుగా ఉంచిందని తేలింది. ఇంకా అర్హత ఉన్న మొత్తాన్ని క్రెడిట్ చేయడంలో విఫలమైందని ఆర్‌బిఐ తెలిపింది. 
 
బీఆర్ చట్టంలో నిర్దేశించిన మార్గాలను, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు క్రెడిట్ సమాచారాన్ని అందించడం, ఇతర నియంత్రణ చర్యల కోసం డేటా ఫార్మాట్'పై సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన కొన్ని ఆదేశాలను ఉల్లంఘించిన కారణం చేత కెనరా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ. 32.30 లక్షల జరిమానా విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments