Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వేల్లో దుర్గంధాన్ని పసిగట్టే అత్యాధునిక సాంకేతికత!!

వరుణ్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (13:45 IST)
దేశంలో నిత్యం పరుగులు తీసే రైళ్లలో అనేక రైలు బోగీల్లో దుర్గంధం వెదజల్లుతుంటుంది. ఈ దుర్వాసను భరిస్తూనే ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా, దూర్గంధ భూయిష్ట, అపరిశుభ్ర టాయిలెట్లు ప్రధాన సమస్యగా ఉంది. 
 
ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. పైగా, రైళ్లలోని అపరిశుభ్రతపై ప్రయాణికుల ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా రైల్వే శాఖ అత్యాధునిక ఐఓటీ సాంకేతికతను (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వినియోగించే యోచనలో ఉంది. 
 
ఈ దిశగా రైల్వే బోర్డు కీలక ప్రతిపాదనలు చేసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ సాంకేతికను రైల్వే బోర్డు ప్రయోగాత్మకంగా కొన్ని కోచ్‌‍లలో పరీక్షించనుంది. ఈ పైలట్ ప్రాజెక్టును అమలు పరిచేందుకు రైల్వే బోర్డు.. ముంబైకి చెందిన విలిసో టెక్నాలజీస్ సంస్థను ఎంపిక చేసింది. 
 
 
ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన కొన్ని బోగీలలో మరుగుదొడ్లలో ప్రత్యేక డిటెక్టర్లను ఏర్పాటుచేశారు. బాత్రూమ్‌లలో దుర్గంధానికి కారణమయ్యే వాయువులను ఇవి గుర్తిస్తాయి. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఓ సెంట్రల్ హబ్‌కు చేరవేస్తాయి. 
 
ఈ సమాచారం ఆధారంగా పారిశుద్ధ్య సిబ్బంది.. అపరిశుభ్ర టాయిలెట్ల సమాచారం అందిన వెంటనే వెళ్లి సమస్య పరిష్కరిస్తారు. సంబంధిత సిబ్బందికి మొబైల్ యాప్, వెబ్ యాప్ ద్వారా ఈ సమాచారం అందుతుందని విలిసో టెక్నాలజీస్ పేర్కొంది. అయితే, ఇది ఏ మేరకు సక్సెక్ అవుతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments