Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరాకు 4 వేల ప్రత్యేక రైళ్లు... గుంటూరు మీదుగా తొమ్మిది ప్రత్యేక రైళ్లు

దేశంలోని రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వచ్చే 40 రోజుల్లో దుర్గా పూజ, దసరా, దీపావళి, ఛాత్ పండుగల రద్దీని దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్ధం నాలుగు వేల ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (16:22 IST)
దేశంలోని రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వచ్చే 40 రోజుల్లో దుర్గా పూజ, దసరా, దీపావళి, ఛాత్ పండుగల రద్దీని దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్ధం నాలుగు వేల ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. 
 
ఈ రైళ్లు సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 30వ తేదీ వరకు వివిధ ప్రధాన స్టేషన్ల మధ్య ప్రత్యేకరైళ్లు నడుపుతామన్నారు. గత ఏడాది పండుగల సందర్భంగా 3,800 రైళ్లు నడపగా ఈ ఏడాది వీటి సంఖ్యను నాలుగువేలకు పెంచామని మంత్రి తెలిపారు. 
 
ఛాత్ పండుగ సందర్భంగా కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదరా, అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ప్రత్యేక రైళ్లు నడుపుతామన్నారు. పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల విక్రయాలు నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. 
 
ఇందులోభాగంగా, గుంటూరు మీదుగా 9 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. నెంబర్‌ 07148 హైదరాబాద్‌ - విశాఖపట్నం ప్రత్యేక రైలు ఈ నెల 28, 30 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి నల్గగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వేస్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 8గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. నెంబర్‌ 07147 విశాఖపట్నం - హైదరాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 29, అక్టోబర్‌ 1 తేదీల్లో రాత్రి 7.20 గంటలకు బయలుదేరి పైన పేర్కొన్న స్టేషన్ల మీదగా తిరుగు ప్రయాణమై మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.
 
అదేవిధంగా, నెంబర్‌ 07001 హైదరాబాద్‌ - కాకినాడపోర్టు ప్రత్యేక రైలు ఈ నెల 27, 29 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి నల్గగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్‌ మీదగా మరుసటి రోజు వేకువజామున 5.35 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. 
 
రైలు నెంబర్‌ 07002 కాకినాడ పోర్టు - హైదరాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 28, అక్టోబరు 2 తేదీల్లో సాయంత్రం 5.55 గంటలకు బయలుదేరి పైన పేర్కొన్న స్టేషన్ల మీదగా తిరుగు ప్రయాణమై మరుసటి రోజు వేకువజామున 5.10 గంటలకు హైదరాబాద్‌ చేరుకొంటుంది. నెంబర్‌ 07001 హైదరాబాద్ ‌- కాకినాడ పోర్టు ప్రత్యేక రైలు అక్టోబర్‌ 1న రాత్రి 11.40 గంటలకు బయలుదేరి పైన పేర్కొన్న స్టేషన్ల మీదగా మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూ టైర్‌, త్రీ టైర్‌, పది స్లీపర్‌ క్లాస్‌ బోగీలు ఉంటాయి. ఈ రైళ్ళలో ప్రయాణం చేయదలచిన వారి కోసం రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments