Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారులకు శుభవార్త చెప్పిన బ్యాంకులు... ఏంటది?

ఠాగూర్
బుధవారం, 9 జులై 2025 (22:43 IST)
దేశంలో కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు ఇది శుభవార్త. సేవింగ్స్ ఖాతాలలో కనీస నిల్వ లేకుంటే విధించే చార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి. ఈ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సహా మరిన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరాయి. 
 
బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల జూలై 1, 2025 నుంచి తమ సాధారణ సేవింగ్స్ ఖాతాలపై ఈ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ప్రీమియం ఖాతాలకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది. ఇదే బాటలో ఇండియన్ బ్యాంక్ కూడా జూలై 7, 2025 నుంచి అన్ని రకాల పొదుపు ఖాతాలపై మినిమ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. 
 
కెనరా బ్యాంకు కూడా ఈ యేడాది మే నెలలో సాధారణం సేవింగ్స్ ఖాతాలతో పాటు ఎన్.ఆర్.ఐ, శాలరీ ఖాతాలపై కూడా ఈ చార్జీని తొలగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వినియోగదారులకు ఊరటనిస్తూ ఇదే విధమైన నిర్ణయం తీసుకున్నాయి. 
 
దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా గతంలోనే ఈ చార్జీలను రద్దు చేసింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఖాతాదారులకు ఆర్థిక సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో బ్యాంకులు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments