Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైట్‌ టు హోమ్‌ 2021 ఎక్స్‌పో ఆన్‌లైన్‌ వెర్షన్‌ నిర్వహించబోతున్న ప్రాప్‌టైగర్‌

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (18:12 IST)
ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజ్‌ సంస్ధ ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ తమ రైట్‌ టు హోమ్‌ 2021 ఎక్స్‌పో ఆన్‌లైన్‌ వెర్షన్‌ను 18-19 మార్చి 2021 తేదీలలో నిర్వహించబోతుంది. ఎలారా టెక్నాలజీస్‌ నిర్వహించబోతున్న ఈ ఆన్‌లైన్‌ ఎక్స్‌పోలో  అదానీ, గోద్రేజ్‌, షాపూర్జీ పల్లోంజీ, సిగ్నేచర్‌, వాధ్వా, టీవీఎస్‌, కల్పతరు వంటి 70 మందికి పైగా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు మొత్తంమ్మీద 19 వేల గృహ యూనిట్లను విభిన్నమైన ధరల విభాగం వద్ద ప్రదర్శించనున్నారు. ప్రధానంగా ఈ యూనిట్‌లు 45 లక్షల రూపాయల నుంచి 4.5 కోట్ల రూపాయల శ్రేణిలో ఉంటాయి.
 
‘‘ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన రైట్‌ టు హోమ్‌ ఎక్స్‌పో రెండవ ఎడిషన్‌ ఆఫ్‌లైన్‌ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయం అందించిన ప్రోత్సాహంతో తామిప్పుడు ఈ ఆన్‌లైన్‌ ఎడిషన్‌తో వచ్చామ’’ని ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ బిజినెస్‌ హెడ్‌ రాజన్‌  సూద్‌ అన్నారు. ఈ ఎక్స్‌పో ద్వారా దాదాపు 2 మిలియన్ల మందిని తాము చేరుకోగలమని భావిస్తున్నట్లు ఆయన వెల్లడిస్తూ ఈ వర్ట్యువల్‌ కార్యక్రమం అందించే ప్రయోజనాలను స్వీకరించేందుకు సంభావ్య కొనుగోలుదారులు, మదుపరులను ఆహ్వానిస్తున్నాం. ఈ ఎక్స్‌పో ద్వారా అత్యుత్తమ రాయితీలను సైతం కొనుగోలుదారులు పొందవచ్చు అని అన్నారు.
 
ఈ ఎక్స్‌పోలో భాగంగా ఎంపిక చేసిన రెరా ప్రాజెక్టుల కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రత్యేకమైన చెల్లింపు ప్రణాళికలు, జీఎస్‌టీ, స్టాంప్‌ డ్యూటీ రద్దు, బుకింగ్స్‌పై బంగారు నాణెములను పొందడం వంటి అవకాశాలూ ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments