Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న మటన్, చికెన్ ధరలు..

Webdunia
గురువారం, 12 మే 2022 (18:53 IST)
మటన్, చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి.  మ‌ట‌న్, చికెన్ ధరలు భారీగా పెరగడంతో కొన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.  ప్ర‌స్తుతం కిలో స్కిన్‌లెస్‌ చికెన్ ధ‌ర రూ.300గా ఉంది. ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు పెళ్లిళ్లు కూడా ఓ కార‌ణ‌మ‌ని పౌల్ట్రీల య‌జ‌మానులు అంటున్నారు. 
 
ఇక బోన్ లెస్ చికెన్ ధ‌ర మ‌ట‌న్ రేటుతో స‌మానంగా ఉంది. కిలో బోన్ లెస్ చికెన్‌ను సుమారు రూ.600ల‌కు విక్రయిస్తున్నారు. ఐదు నెల‌ల క్రితం కిలో చికెన్ ధ‌ర రూ.80గా ఉన్నది. ఇప్పుడు రూ.300లకు పెరిగింది. అలాగే నాటు కోడి ధరలు కూడా పెరిగిపోయాయి. కిలో నాటు కోడి ధర రూ. 480గా ప‌లుకుతోంది.
 
వేసవి ఎండలు విపరీతంగా ఉండటం, వేడి గాలులు వీస్తుండటంతో ఫారాల్లో కోళ్లు చనిపోతున్నాయి. ఫలితంగా కిలో చికెన్ ధర రూ. 300కు చేరింది. గడిచిన వారం రోజుల్లోనే కిలో చికెన్ ధర రూ. 50 నుంచి 60 వరకు పెరిగింది.  
 
మరోవైపు మటన్ ధరలు కూడా మండిపోతున్నాయి. 10 రోజుల క్రితం కిలో మటన్ రూ. 750 వరకు ఉండేది. ప్రస్తుతం కిలో మటన్ ధర రూ. 800 నుంచి రూ. 850 వరకు పలుకుతుంది. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments