Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలకు రూ.1500 పెట్టుబడి.. మెచ్యూరిటీ సమయానికి రూ.35 లక్షలు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (15:50 IST)
భారత తపాలా శాఖలో వివిధ రకాలై పొదుపు పథకాలను అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో గ్రామ్ సురక్షా యోజనా పథకం ఒకటి. ఈ పొదుపు పథకం కింద నెలకు రూ.1,500 చొప్పున పెట్టుబడిపెట్టినట్టయితే, ఆ పథకం మెచ్యూరిటీ సమయానికి రూ.35 లక్షల మేరకు రిటర్న్స్ పొందవచ్చు. 
 
ఈ పథకం గురించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, ఈ పథకంలో చేరాలంటే చందాదారుని వయసు 19 యేళ్లు అంతకంటే ఎక్కువగా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 35 యేళ్ళు. ఈ పథకం కనీస విలువ రూ.10 వేల హామీని అందజేస్తుండగా, పెట్టుబడిపెట్టేవారు రూ.10 లక్షల వరకు తమ ఆర్థిక స్థోమతను బట్టి పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా పెట్టుబడి పెట్టిన వారి వయసు 80 యేళ్లు దాటిన తర్వాత వారి చట్టపరమైన లేదా నామినీకి బోనస్‌తో కూడిన మొత్తం చెల్లిస్తారు. 
 
ఇందులో పెట్టుబడిపెట్టేవారు తమ ప్రీమియం మొత్తాన్ని మూడు, ఆరు, సంవత్సరం ఇలా మూడు ప్రాతిపదికన చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లించడానికి ఖాతాదారుడుకి కనీసం 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో చెల్లించకపోతే చందాదారుడు బకాయి ఉన్న ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ పాలసీని తిరిగి పునరుద్ధరించుకునే వెసులుబాటు వుంది. 
 
ఉదాహరణకు ఒక యువకుడు 19 యేళ్ల వయసులో ఈ పథకం కింద చేరి రూ.10 లక్షల పెట్టుబడిపెడితే నెలవారీ ప్రీమియంగా 55 యేళ్లకు నెలవారీ ప్రీమియం రూ.1515 చొప్పున చెల్లించాల్సి వుంటుంది. అతనికి 55 యేళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.31.60 లక్షలుగా చెల్లిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments