Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ : చందా కొచ్చర్ - శిఖా శర్మలకు ఉచ్చు

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ స్కామ్) ప్రభావం మరింత మంది బ్యాంకర్లను కలవరపెడుతోంది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు చీఫ్ శిఖా శర్మలకు అవినీతి వ్యతిరేక సంస్థ ఎస్‌ఎఫ్ఐవో నో

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (13:50 IST)
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ స్కామ్) ప్రభావం మరింత మంది బ్యాంకర్లను కలవరపెడుతోంది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు చీఫ్ శిఖా శర్మలకు అవినీతి వ్యతిరేక సంస్థ ఎస్‌ఎఫ్ఐవో నోటీసులు జారీచేసింది. ముకుల్ చోక్సీకి చెందిన గీతాంజలి నగల సంస్థకు రుణాలు మంజూరు చేయడంపై విచారణ జరిపేందుకు ఈ ఇరువురు టాప్ బ్యాంకర్లకు నోటీసులు జారీచేసినట్టు చెబుతున్నారు.
 
సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి లక్షలాది రూపాయలను రుణంగా తీసుకుని దేశం విడిచి పారిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు చీఫ్ శిఖా శర్మలకు ఏసీబీ నోటీలు జారీ చేయడం ఇపుడు దేశ బ్యాంకింగ్ రంగంలో సంచలనంగా మారింది.
 
కాగా, నీరవ్‌ మోడీతో తమకెలాంటి సంబంధం లేదని.. గీతాంజలి గ్రూప్‌కు మాత్రమే తాము రుణం ఇచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే ఎంత అప్పు ఇచ్చిందనే విషయాన్ని తెలపలేదు. అలాగే, యాక్సిస్‌ బ్యాంకు కూడా గీతాంజలి గ్రూపునకు భారీగా రుణం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐదు మేజర్‌ బ్యాంకులకు చెందిన ఎండీలకు ఈ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments