Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్‌ బాదుడు : బోర్డులో రూ.10 .. పెన్నుతో రూ.30

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (11:17 IST)
హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లల ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను ఒక్కసారిగా పెంచేశారు. దేశవ్యాప్తంగా రూ.10గా ఉన్న ధరను ఆయా స్టేషన్ల రద్దీకనుగుణంగా రూ.30 వరకు పెంచుకునే అవకాశం ఇవ్వడంతో.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో రూ.10 నుంచి రూ.30 అయ్యింది. 
 
హైదరాబాద్‌లో రూ.20కి పెంచారు. కాచిగూడలో మాత్రం రూ.10 ఉంది. మౌలాలి, మల్కాజిగిరి, లింగంపల్లి రైల్వేస్టేషన్లలోనూ రూ.10గానే ఉంది. నగరంలోని మూడు రైల్వేస్టేషన్లలో కరోనాకు ముందు రోజూ దాదాపు 25 వేల ప్లాట్‌ఫాం టిక్కెట్లు అమ్ముడయ్యేవి. పెరిగిన ధరలతో రైల్వేకు రోజుకు రూ.7.10 లక్షల వరకూ ఆదాయం సమకూరే అవకాశం ఉంది!
 
సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లలో సోమవారం నుంచి ప్లాట్‌ఫాం టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. ముందస్తు సూచన లేకుండానే సోమవారం నుంచి పెంచిన ధరలను అమల్లోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషనులో కౌంటర్‌ బోర్డుపై రూ.10 అని రాసిన పాత ధరల పట్టిక అలాగే ఉంది. 
 
కింద కౌంటర్‌ కిటికీ దగ్గర కాగితంపై రూ.30 అని రాసి.. అమ్మకాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని గుర్తించి కొందరు వాదులాటకు దిగారు.  ఉన్నతాధికారులు స్పందిస్తూ.. కరోనా నేపథ్యంలో రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనాతగ్గిన తర్వాత ధరలు తగ్గుతాయా? అంటే వారి దగ్గర సమాధానం లేకపోయింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments