Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణలలో ఉత్పత్తి, పంపిణీని పెంచిన పిడిలైట్ రాఫ్

ఐవీఆర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (19:46 IST)
పిడిలైట్ ఇండస్ట్రీస్ నుండి ప్రముఖ టైల్స్ ఎడ్హెసివ్  బ్రాండ్ అయిన రాఫ్ హైదరాబాద్ సమీపంలోని జడ్చర్లలో తమ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈశాన్య కర్ణాటక మార్కెట్లలో అధిక నాణ్యత గల టైల్ ఎడ్హెసివ్ ఉత్పత్తుల కోసం పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ఈ సదుపాయం తోడ్పడనుంది. పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ పూరి మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్‌లలో ప్రీమియం, ప్రత్యేక ఉత్పత్తులకు డిమాండ్‌ పరంగా స్థిరమైన పెరుగుదలను మేము గమనించాము. టైల్, స్టోన్ ఫిక్సింగ్‌ను ఆధునీకరించాలనే మా లక్ష్యంకు అనుగుణంగా మా జడ్చర్ల ప్రాజెక్ట్ ఉంది. వినియోగదారులకు మేలైన ఎడ్హెసివ్ పదార్థాలను అందించడం, తయారీని మార్కెట్‌లకు చేరువ చేయడం మా లక్ష్యం" అని అన్నారు. 
 
పిడిలైట్ ఇండస్ట్రీస్ యొక్క పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా, ఈ సదుపాయం జీరో-వేస్ట్ ప్లాంట్‌గా పనిచేస్తుంది. 80% సౌరశక్తితో నడుస్తుంది, నిర్మాణ రసాయనాల రంగంలో పర్యావరణ అనుకూల తయారీకి కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తుంది. అధునాతన ఆటోమేషన్‌తో కూడిన ఈ ప్లాంట్ ఉత్పత్తిలో అధిక ఖచ్చితత్వం, స్థిరత్వం, నాణ్యత, సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. దీని వ్యూహాత్మక స్థానం సరఫరా గొలుసు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ప్రత్యేకమైన, అధిక-నాణ్యత కలిగిన టైల్ ఎడ్హెసివ్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తుంది.
 
గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా, జడ్చర్ల కేంద్రం, పిడిలైట్ యొక్క దీర్ఘకాలిక వృద్ధి వ్యూహానికి అనుగుణంగా భవిష్యత్ విస్తరణకు విస్తృత అవకాశాలను అందిస్తుంది. 350 మందికి పైగా డీలర్లు, వినియోగదారులు హాజరైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సౌకర్యం అత్యాధునిక సాంకేతికత, స్థిరమైన అభ్యాసాలను ప్రదర్శించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments