Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ ‌160 కోసం ప్రీ బుకింగ్‌ తెరిచిన పియాజ్జియో ఇండియా

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (18:14 IST)
త్వరలో ఆవిష్కరించనున్న తమ ఏప్రిలియా శ్రేణిలోని ప్రీమియం స్కూటర్‌ ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 కోసం ముందస్తు బుకింగ్స్‌ను తెరిచినట్లు నేడు వెల్లడించింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రీమియం స్కూటర్‌ ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160. పూనెలోని బారామతి ప్లాంట్‌లో దీని ఉత్పత్తిని ఆరంభించారు. ఐదు వేల రూపాయల బుకింగ్‌ మొత్తంతో ఈకామర్స్‌ వెబ్‌సైట్‌ ఏప్రిలియాఇండియా డాట్ కామ్ ద్వారా లేదా ఏదైనా ఏప్రిలియా డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.
 
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రీమియం స్కూటర్‌ ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160లో ఏప్రిలియా యొక్క తాజా అంతర్జాతీయ డిజైన్‌ భాషను జొప్పించారు. దీనితో అత్యున్నత పనితీరు కలిగిన 160 సీసీ బీఎస్‌6, మూడు వాల్వ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ స్వచ్ఛమైన ఉద్గారాల ఇంజిన్‌ సాంకేతికత ఉంది. ఇది అత్యున్నత శక్తి మరియు టార్క్‌ను అందించడంతో పాటుగా అసాధారణ సవారీ అనుభవాలను సైతం అందిస్తాయి.
 
ఇది ఇతర ఫీచర్లు అయినటువంటి వ్రాప్‌ ఎరౌండ్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌, ఎల్‌ఈడీ టైల్‌లైట్స్‌, పూర్తి స్థాయి డిజిటల్‌ క్లస్టర్‌, మొబైల్‌ కనెక్టివిటీ ఆప్షన్‌, పెద్దదైన, పొడవైన, సౌకర్యవంతమైన సీటు, మార్చుకోతగిన వీలున్న సస్పెన్షన్‌, ఏబీఎస్‌తో డిస్క్‌ బ్రేక్‌లు మరియు సిగ్నేచర్‌ ఏప్రిలియా గ్రాఫిక్స్‌ ఉన్నాయి. భారతదేశం కోసం ఇటలీలో డిజైన్‌ చేసిన ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 తనతో పాటుగా శైలి, పనితీరు, అసాధారణ సౌకర్యంతో కూడిన సవారీ అనుభవాలతో పాటుగా సౌందర్యమూ తీసుకువస్తోంది.
 
ఈ సందర్భంగా శ్రీ డియాగో గ్రాఫీ, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, పియాజ్జియో ఇండియా మాట్లాడుతూ, ‘‘మా ప్రీమియం స్కూటర్‌ ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ను ఉత్పత్తి ప్రారంభించడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. 2020 సంవత్సరం అత్యంత సవాల్‌తో కూడుకుని ఉంది, కానీ మేము మా వాగ్ధానాలను నిలుపుకుంటూ ముందుగానే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న స్కూటర్‌ను ఆవిష్కరించాం. 
 
ఇప్పుడు ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ముందస్తు బుకింగ్స్‌ను మా మహోన్నతమైన వినియోగదారుల కోసం మా ఇ-కామర్స్‌ వేదికతో పాటుగా భారతదేశవ్యాప్తంగా మా డీలర్‌షిప్‌ల వద్ద ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160  తమ వినూత్నమైన రేపటితరపు డిజైన్‌ మరియు సాంకేతికంగా అత్యాధునిక ఫీచర్లతో ఎన్నటికీ మరిచిపోలేనట్టి అనుభవాలను ఏప్రిలియా అభిమానులకు సృష్టించనుంది’’ అని అన్నారు. ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 అత్యంత ఆకర్షణీయమైన గ్లోసీ రెడ్‌, గ్లోసీ వైట్‌ మరియు మాట్‌ బ్లాక్‌ రంగులలో లభ్యమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments