Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్‌లో రూ.90వేల కోట్ల పెట్టుబడి : ఈపీఎఫ్ఓ

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (14:15 IST)
భారత స్టాక్ మార్కెట్ ఈక్విటీలలో రూ.90వేల కోట్లను పెట్టుబడిగా పెట్టాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) రంగం సిద్ధం చేసుకుంటోంది. వాస్తవానికి మార్కెట్లను మరింత ముందుకు నడిపించేందుకు ఈపీఎఫ్ఓ నిధిలో కనీసం 15 శాతం మార్కెట్లకు తరలించాలని కేంద్ర కార్మిక శాఖ సూచించినా, అందుకు అంగీకరించని ఈపీఎఫ్ఓ బోర్డు 5 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది.
 
సుమారు రూ. 18 లక్షల కోట్ల రూపాయల మేరకు పీఎఫ్ నిధులను కలిగివున్న ఈపీఎఫ్ఓ నుంచి రూ. 2.7 లక్షల కోట్ల రూపాయలను మార్కెట్ కంపెనీల్లో పెట్టించాలని చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, సుమారు రూ. 90 వేల కోట్ల రూపాయలు త్వరలో వివిధ కంపెనీల ఈక్విటీల్లోకి రానున్నాయి.
 
ప్రస్తుతం ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) రూపంలో రూ. 6 లక్షల కోట్ల వరకూ పీఎఫ్ నిధులు మార్కెట్లలో ఉన్నాయి. ఈ సంవత్సరం కేవలం 5 శాతం నిధులను మాత్రమే స్టాక్స్‌లో పెడతామని, వాటి పనితీరు ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments