Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్‌లో దేశీయంగా లీటరు పెట్రోల్ ధర రూ.60!!?

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (13:28 IST)
భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు గణనీయంగా పడిపోనున్నాయి. ఈ కారణంగా దేశీయంగా కూడా లీటరు పెట్రోల్ ధర రూ.60 కంటే దిగువకు పడిపోయే అవకాశం ఉన్నట్టు చమురు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గిపోతున్న విషయం తెల్సిందే. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగినట్టయితే మరింతగా పడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం 75 డాలర్ల వద్ద కొనసాగుతున్న బ్యారల్ ముడిచమురు ధర 60 డాలర్ల వరకూ తగ్గనుంది. 
 
అదే జరిగితే దేశవాళీ మార్కెట్లోనూ పెట్రోల్ ధర రూ.60 కన్నా కిందకు వస్తుంది. 2011 మే వరకూ రూ.60 దిగువన ఉన్న పెట్రోల్ ధర ఆ తర్వాత మరే దశలోనూ ఆ స్థాయికి చేరలేదు. గడచిన జూన్‌లో రూ.6600 (110 డాలర్లు) వద్ద ఉన్న బ్యారల్ క్రూడాయిల్ ధర ఈ నెలలో రూ.4,800 (76 డాలర్లు)కు పడిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం జరిగే ఒపెక్ సమావేశంలో ముడిచమురు ఉత్పత్తిని తగ్గించేందుకు అరబ్ దేశాలు అంగీకరించకుంటే ధరలు మరింతగా తగ్గవచ్చని చమురు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments