కరోనా కష్టకాలంలోనూ బ్రేకులు లేని పెట్రోల్ ధరలు

Webdunia
గురువారం, 6 మే 2021 (11:46 IST)
కరోనా కష్టకాలంలోనూ కేంద్ర ప్రభుత్వ చమురు రంగ సంస్థలు కనికరించడం లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ వారం పదిరోజుల పాటు పెట్రోల్, డీజిల్ బాదుడుకూ దూరంగా ఉన్న ఆయిల్ కంపెనీలు... ఇపుడు మళ్లీ ధరలను పెంచుతుయన్నాయి. రోజువారీ సమీక్షను ఆసరాగా తీసుకున్న ఆయిల్ కార్పొరేషన్లు ధరలను పెంచుతున్నాయి. వరుసగా మూడో రోజైన గురువారం కూడా ఈ ధరలను పెంచాయి. 
 
ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు వెలువ‌డిన మ‌రుస‌టి రోజు నుంచే దేశీయ చ‌మురు కంపెనీలు ధ‌ర‌ల‌ను పెంచుతూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో వ‌రుస‌గా మూడో రోజూ వాహ‌ణ‌దారుల‌పై భారం మోపాయి. బుధవారం లీట‌ర్ పెట్రోల్‌పై 19 పైస‌లు, లీటర్ డీజిల్‌పై 21 పైసల చొప్పున పెంచ‌గా, గురువారం మరోసారి 25 పైస‌లు, 30 పైస‌ల చొప్పున బాదాయి. 
 
దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.90.99, డీజిల్‌ రూ.81.42కు చేరింది. ఇక తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్‌ రూ.88.39, చెన్నైలో పెట్రోల్‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.35, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.14, డీజిల్‌ రూ.84.26కు చేరాయి.
 
ఇక బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.01, డీజిల్‌ రూ.86.31కు, హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.57, డీజిల్‌ రూ.88.77కు, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.03, డీజిల్‌ రూ.89.62కు చేరాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధ‌మైన ప‌న్నులు విధిస్తుండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments