Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ చమురు ధరల దూకుడు...

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (08:57 IST)
దేశంలో మళ్లీ చమురు ధరల దూకుడు మొదలైంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లోని తాజా పరిణామాల నేపథ్యంలో ఆగస్టు చివరివారం నుంచి ముడిచమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశంలోని రీటెయిల్‌ మార్కెట్లో పెట్రోలు, డీజిలు అమ్మకాలపై పడుతుంది. 
 
అయితే, గత పక్షం రోజులుగా దేశంలోని పెట్రో ధరల్లో పెంపుదల లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఇపుడున్న పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పదని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఆగస్టు నెలలో ఉన్న సగటు ధరలతో పోలిస్తే బ్యారెల్‌ చమురు ధర 4 నుంచి 6 అమెరికన్‌ డాలర్లమేర పెరిగిందని గుర్తు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా పెట్రోల్ ధరల్లో మార్పులు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ.101.19, డీజిలు రూ.88.62 పలుకుతున్నాయి. మెక్సికో సమీపంలోని సముద్రపు ఒడ్డున అగ్నిప్రమాదంతో ఉత్తర అమెరికాలో క్రూడాయిల్‌ ఉత్పత్తి తగ్గింది. అలాగే, యూఎస్‌ - గల్ఫ్‌ తీరంలో ఇడా తుపాను కారణంగా ముడి చమురు ఉత్పత్తిలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పెట్రోల్, డీజల్ ధరల్లో మార్పులు సంభవించాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments