Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ ధరను రోజూ పెంచడమే... ఇదే ఆయిల్ కంపెనీల దినచర్య

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (08:28 IST)
దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశ ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ.. ఆయిల్ కంపెనీలు మాత్రం బేఖాతర్ అంటున్నాయి. ఈ ధరలను రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నాయి. తగ్గింపు అనే మాటే తమ డిక్షనరీలో లేదన్నట్టుగా ఆయిల్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజల్ భారం రోజురోజుకూ ఎక్కువైపోతోంది. 
 
పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి. ఇక తాజాగా మరోసారి పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్ డీజిల్‌‌పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.89 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.62కు చేరింది.
 
ఇకపోతే, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.78 చేరగా.. డీజిల్ ధర రూ.103.63 కు చేరింది. కోల్‌ కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45 చేరగా.. డీజిల్ ధర రూ.98.73 కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.92 చేరగా.. డీజిల్ ధర రూ.99.92కు చేరింది.
 
ఇక హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.18 చేరగా.. డీజిల్ ధర రూ.104.32కు చేరింది. ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.112.90 కాగా డీజిల్‌ ధర రూ.105.42గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments