Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలకు రూ.15 వేలు ఖర్చు చేస్తున్నారా.. రూ.225 చెల్లించాల్సిందే.. ఎందుకు?

Webdunia
బుధవారం, 20 మే 2015 (13:39 IST)
దేశ ప్రజలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరింతగా ఆర్థిక భారం మోపనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 14 శాతం పన్నును జూన్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది. దీంతో ప్రస్తుతం వసూలు చేస్తున్న 12.36 సేవా పన్ను ఇక నుంచి 14 శాతం చొప్పున వసూలు చేయనున్నారు. ఫలితంగా అన్ని విభాగాల్లోనూ ప్రజలు అదనపు సొమ్మును చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
ముఖ్యంగా రెస్టారెంటు లేదా హోటల్‌కెళ్లి భోజనం చెయ్యాలన్నా... మొబైల్ ఫోనుకు రీచార్జ్ చేయాలన్నా, బీమా చేయించుకోవాలన్నా, ఏదైనా మాల్‌కు వెళ్లి గృహోపకరణాలు కొనాలన్నా, మరొకటి చేయాలన్నా ఈ 14 శాతం పన్నును విధిగా చెల్లించాల్సిందే. ఫలితంగా వినియోగదారునిపై అదనపు భారం పడనుంది. 
 
అలాగే, కేంద్ర, రాష్ట్ర సేవలపైనా కొత్త పన్నులు అమలు కానున్నాయి. దీంతో పెట్రోలు ధర కూడా స్వల్పంగా పెరగనుంది. వ్యాపార ప్రకటనలు, విమాన ప్రయాణం, ఆర్కిటెక్చర్ సేవలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ కార్డు సేవలు వంటివాటిపైనా అధికంగా చెల్లించాల్సిందే. మొత్తం మీద నెలకు రూ.15 వేలను ఖర్చు చేసేవారిపై మరో రూ.225 వరకూ సేవా పన్నును ముక్కుపిండి వసూలు చేయనున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments