Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ఘాటు.. వందకే ఐదు కేజీలు వచ్చేవి.. కానీ ఇప్పుడు..?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (15:00 IST)
ఉల్లిపాయల రేటు పెరిగిపోయాయి. నెల క్రితం వంద రూపాయలకే ఐదు కేజీల ఉల్లిగడ్డలు వచ్చేవి. కానీ సీన్ మారింది. ప్రస్తుతం ఉల్లి కిలో కొనాలంటేనే వంద పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కేజీ ఉల్లిగడ్డలు కొనాలంటే రూ.50-80 వరకు చెల్లించాలి. అంటే నెల రోజుల వ్యవధిలోనే ధర భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సామాన్యులకు మరో షాక్ తగలనుంది. 
 
ఉల్లి గడ్డల ధర ఇంకా భారీగా పెరిగే అవకాశముందని వ్యాపారులు షాకిస్తున్నారు. పండుగ నాటికి ఉల్లి ధర కొండెక్కి కూర్చొనుందని వారు చెప్తున్నారు. ఉల్లి ధరలు ఇలానే పెరుగుతూ వెళ్తే దీపావళి పండుగ నాటికి కేజీ ఉల్లి గడ్డల ధర రూ.100కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఉల్లి గడ్డల ధర భారీ స్థాయిలో పెరగొచ్చనే అంచనాలకు ఒక ప్రధాన కారణం ఉంది. 
 
అకాల వర్షాల కారణంగా ఉల్లి గడ్డల ధర భారీగా పెరగనుంది. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతింటోంది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి గడ్డల మార్కెట్ లాసాల్‌గాన్ (నాసిక్ దగ్గరిలో)లో ఇప్పుడు ఉల్లి ధర క్వింటాల్‌కు దాదాపు రూ.7,000 సమీపంలో ఉంది. ట్రేడర్లు ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఉల్లి గడ్డల ధర కేజీకి ఏకంగా రూ.100కు చేరే ఛాన్స్ ఉందనంటున్నారు. 
 
మహరాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడే ఉల్లి పంట దెబ్బతింది. కేవలం మహరాష్ట్రలో మాత్రమే కాకుండా కర్నాటక, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా ఉల్లి పంట దెబ్బతింది. దీంతో ఉల్లి గడ్డల ధర పెరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments