Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రానికి దడ పుట్టిస్తున్న ఉల్లి ధర.. భారీగా దిగుమతికి ఓకే

Webdunia
బుధవారం, 29 జులై 2015 (15:47 IST)
దేశంలో ఉల్లి ధర ఒక్కసారి ఆకాశానికి తాకింది. చిల్లర మార్కెట్‌లో వీటి ధరలు ఒక్కసారిగా రెట్టింపు (50 శాతం) పెరిగాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోగా ఇది కేంద్రానికి దడ పుట్టిస్తోంది. ఉల్లి ధరల అదుపునకు ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకున్నప్పటికీ.. ఈ ధరల పెరుగుదలకు కళ్లెం వేయలేక పోతున్నారు. ఎగుమతులు నిరుత్సాహపరిచేలా ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరను పెంచి... దిగుమతులను ప్రోత్సహిస్తున్నప్పటికీ వీటి ధరలు మాత్రం తగ్గడం లేదు. 
 
దేశంలో ఉల్లికి ప్రధాన మార్కెట్లు పుణే, లసల్‌గావ్‌‌లు. ఇక్కడి హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లి ధర 50 శాతానికిపైగా పెరిగింది. దీనికితోడు రిటైల్‌ మార్కెట్‌లో కూడా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. పుణేలో రూ.14 నుంచి రూ.23కి మధ్యన ధర పలుకుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో ఉల్లి రూ.40 పైమాటే. వాతావరణం అనుకూలం లేకపోవడం, సరైన దిగుబడులు లేక ధరలు పెరిగాయని, మార్కెట్‌లోకి సరుకు వస్తే ధరలు వాటంతట అవే తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
 
అయితే, మున్ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి కరువుతో పాటు.. బ్లాక్‌మార్కెటింగ్‌ కారణమని ప్రభుత్వం భావిస్తోంది. బడాబడా వ్యాపారస్తులు, పెద్ద రైతులు ఉల్లిని బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేయకుండా.. నిల్వ చేస్తున్నారని అనుమానిస్తోంది. త్వరలో విజిలెన్స్ దాడులు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments