Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యవస్థాపక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఎన్‌ఎస్‌డీసీ

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (00:02 IST)
స్వీయ ఉపాధికి మద్దతు అందించడంతో పాటుగా వ్యవస్ధాపక అవకాశాలకు మద్దతు అందించేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక (ఎంఎస్‌డీఈ) పరిధిలోని నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) స్కిల్‌ ఇండియా మిషన్‌ కింద భారతదేశంలో అగ్రగామి జీవిత భీమా సంస్థలలో ఒకటైన హెచ్‌డీఎప్‌సీ లైఫ్‌తో  భాగస్వామ్యం చేసుకుంది.
 
ఈ భాగస్వామ్యంలో భాగంగా, చివరి మైలు వరకూ చేరుకోవడాన్ని బలోపేతం చేయడం ద్వారా శిక్షణ పొందిన జీవిత భీమా సలహాదారులు జొప్పించడంలో  ఎన్‌ఎస్‌డీసీ ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కు మద్దతు అందిస్తుంది. అదనంగా, ఈ భాగస్వామ్యంతో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఐఆర్‌డీఏఐ) నిర్వహించే ఐసీ 38 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు శిక్షణ సైతం అందిస్తూ, నైపుణ్యాభివృద్ధి చేయనున్నారు. అంతేకాదు,  సాఫ్ట్‌ స్కిల్స్‌ను అందించడం ద్వారా ఈ భాగస్వామ్యం, స్థిరమైన జీవనోపాధి కోసం స్వీయ ఉపాధి అవకాశాలను అన్వేషించేలా యువతకు తగిన సదుపాయాలనూ అందిస్తుంది. ఈ అభ్యర్ధులకు సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ అందిస్తారు. అవి వారిని ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దుతాయి. తద్వారా సంభావ్య వినియోగదారులను అత్యుత్తమంగా కనెక్ట్‌ కావడమూ సాధ్యమవుతుంది.
 
ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌డీసీ ఇంటర్నేషనల్‌ ఎండీ- ఎన్‌ఎస్‌డీసీ సీఈఓ వేద్‌ మణి తివారీ మాట్లాడుతూ, ‘‘ఒక స్థిరమైన మరియు సాధ్యమయ్యే నైపుణ్య వ్యవస్ధను సృష్టించడానికి ఎన్‌ఎస్‌డీసీ ప్రయత్నిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌తో  ఈ భాగస్వామ్యం ప్రస్తుత నైపుణ్యాలను బలోపేతం చేయడం మరియు మార్కెట్‌ అవసరాలకు తగినట్లుగా భీమా రంగంలో నైపుణ్యాభివృద్ధి చేయడం దిశగా అతి ముఖ్యమైన ముందడుగు ఇది. భారతీయ యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు అదనపు నైపుణ్యాలను అందించడమనేది కేవలం తమ సిబ్బందిని శక్తివతం చేయడం మాత్రమే కాకుండా, ఆర్ధిక వ్యవస్ధలో నూతన అభివృద్ధి చెందుతున్న రంగాలనూ  సృష్టించనుంది. ఈ భాగస్వామ్యం రెండు సంస్థలకూ భారీ వృద్ధి సామర్థ్యాన్ని అందించడంతో పాటుగా ఉద్యోగార్ధుల నుంచి ఉద్యోగ ప్రదాతలుగా మారడానికి అర్హత కలిగిన అభ్యర్ధులకు అత్యున్నత అవకాశాలనూ అందిస్తుంది’’ అని అన్నారు.
 
ఈ భాగస్వామ్యం గురించి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేష్‌ బదామీ మాట్లాడుతూ,  ‘‘ఎన్‌ఎస్‌డీసీతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. దీనిద్వారా స్కిల్‌  ఇండియా మిషన్‌కు మా వంతు తోడ్పాటు అందిస్తున్నాము. భారీ సంఖ్యలో యువత ఉద్యోగులుగా ప్రవేశిస్తుండటంతో   వృద్ధి దిశగా ఇండియా ప్రవేశిస్తుంది. ఎన్‌ఎస్‌డీసీతో మా భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా తమ జీవనోపాధిని నిర్మించుకునే  అవకాశాన్ని వ్యక్తులకు అందిస్తుంది. మా శక్తివంతమైన అభ్యాస, అభివృద్ధి ప్లాట్‌ఫామ్‌ను విభిన్న నైపుణ్యాలతో వ్యక్తులను సన్నద్ధం చేయడానికి రూపొందించబడింది.ఈ వ్యక్తులు దేశంలో జీవిత భీమా పరిధిని వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు’’ అని అన్నారు.
 
ఈ భాగస్వామ్యం జీవనోపాధి సృష్టిని సులభతరం చేయడానికి, ఆర్థిక, సామాజిక చేరిక కోసం వ్యవస్థాపక అవకాశాలకు ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినది. అదనంగా, ఈ భాగస్వామ్యం కింద తీర్చిదిద్దిన ఈ ప్రోగ్రామ్‌ గురించి విస్తృత అవగాహన కల్పించడానికి ఎన్‌ఎస్‌డీసీ మరియు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లు పలు డిజిటల్‌, ఆన్‌ గ్రౌండ్‌ కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments