Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సంపన్న కుటుంబం...

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. ఆయన ఘనత ఇపుడు ఆసియా ఖండం మొత్తం వ్యాపించింది. సంపదలో ఆయన ఆసియా ఖండంలోనే నంబర్ వన్‌గా నిలించారు. ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతమైన కుటుంబంగా ముఖేష్ అంబానీ ఫ్యామి

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (08:45 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. ఆయన ఘనత ఇపుడు ఆసియా ఖండం మొత్తం వ్యాపించింది. సంపదలో ఆయన ఆసియా ఖండంలోనే నంబర్ వన్‌గా నిలించారు. ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతమైన కుటుంబంగా ముఖేష్ అంబానీ ఫ్యామినీని ప్రతిష్టాత్మక మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకటించింది. 
 
ఇపుడు ముఖేష్ కుటుంబ నికర సంపద 44.8 బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది. గత ఏడాది కంటే 19 బిలియన్ డాలర్ల సంపద పెరగటం విశేషం. ఆసియా ఖండంలోనే సంపన్న కుటుంబాల్లో టాప్ ఉండే శాంసంగ్ అధినేత లీస్ కుటుంబం ఈసారి.. 40.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఆసియా ఖండంలో నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కంపెనీ సన్ హంగ్ కై ప్రాపర్టీస్ సంస్థ అధినేత హాంగ్ కాంగ్ క్వాంక్ కుటుంబం ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. వీరి ఆస్తులు 40.4బిలియన్ డాలర్లు.
 
ఫలితంగా రిలయన్స్ అధినేత కుటుంబం ఈసారి ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతమైన కుటుంబంగా అవతరించింది. భారతదేశం నుంచి టాప్-10లో కూడా మరే పారిశ్రామికవేత్త లేకపోవడం గమనార్హం. టాప్-50 మందిలో మాత్రం 18 సంపన్న కుటుంబాలు భారతదేశం నుంచి ఉన్నాయి. వీరిలో విప్రో ప్రేమ్ జీ, హిందూజ, మిట్టల్, మిస్త్రీ, బిర్లా, గోద్రేజ్, బజాజ్, జిందాల్, ఐచర్, బుర్మాన్స్, శ్రీ సిమెంట్ అధినేతల కుటుంబాలు ఉన్నాయి. మరే దేశం నుంచి ఇన్ని సంపన్న కుటుంబాలు లేకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments