Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (23:52 IST)
సామాజిక మరియు వ్యక్తిగత కారణాల కోసం భారతదేశంలో అతి పెద్ద క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన మిలాప్‌ ఇప్పుడు స్ఫూర్తిదాయక వీడియో ప్రచారాన్ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2023 ను పురస్కరించుకుని విడుదల చేసింది. ఆరోగ్యసంరక్షణ రంగానికి వెన్నుముకగా నర్సులు అందిస్తోన్న అసాధారణ తోడ్పాటును గుర్తిస్తూ ఈ సంవత్సర నేపథ్యం ‘మన నర్సులు, మన భవిష్యత్‌’ ఆధారంగా తీర్చిదిద్దారు.
 
ఈ వీడియో ప్రచారాన్ని అవిశ్రాంతంగా, జాగ్రత్తగా, నిస్వార్థంగా సేవలనందిస్తున్న నర్సులకు తగిన గుర్తింపును తీసుకువచ్చే రీతిలో తీర్చిదిద్దారు. రోగి చికిత్స ప్రక్రియలో అత్యంత కీలకమైన పాత్రను నర్సులు పోషిస్తుంటారు. డాక్టర్లు సైతం ఈ నర్సుల నైపుణ్యం, అనుభవం, అంకితభావాన్ని ప్రశంసిస్తే, జూనియర్‌ డాక్టర్లు వీరి దగ్గర విలువైన పాఠాలనూ నేర్చుకుంటుంటారు.
 
మిలాప్‌ అధ్యక్షుడు మరియు కో-ఫౌండర్‌ శ్రీ అనోజ్‌ విశ్వనాథన్‌ ఈ వీడియో ప్రచారం గురించి మాట్లాడుతూ ‘‘ నర్సులకు మేము వందనాలనర్పిస్తున్నాము. రోగి కోలుకోవడంలో వీరి తోడ్పాటు, అవిశ్రాంత ప్రయత్నాలు అనన్య సామాన్యం.  రోగుల శారీరక, మానసిక సౌకర్యం మొదలు, అవసరమైన వైద్య చికిత్సల అమలు, రోగులు, వారి బంధువులకు తగిన సమాచారం అందించడంలో వారి పాత్ర మరువలేము. ఈ ప్రచారం ద్వారా వారి ప్రయత్నాలను వేడుక చేస్తున్నాము’’ అని అన్నారు.
 
అద్భుతమైన నర్సు, రిటైర్డ్‌ ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌ పర్సన్‌, 75 ఏళ్ల వయసు కలిగిన, హైదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌కు చెందిన శ్రీ హరిదాస్‌, సేవలను ఈ వీడియోలో ఒక రోజంతా ఒడిసిపట్టారు. ప్రతికూల పరిస్థితిలలో సైతం నర్సులు చూసే అభిమానం, నిబద్ధతను దీనిలో ఒడిసిపట్టారు. మిలాప్‌ ఇప్పుడు హాస్పిటల్స్‌, హెల్త్‌కేర్‌ ఇనిస్టిట్యూషన్‌లు ఈ వీడియోను అంతర్గతంగా పంచుకోమని కోరుతూనే, ఈ అన్‌సంగ్‌ హీరోల పట్ల అవగాహన మెరుగుపరచడంతో పాటుగా నర్సులను ప్రశంసించాల్సిందిగా కోరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments