Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్ట్రక్చరల్ హార్ట్ ఇమేజింగ్‌లో 300కి పైగా క్లినిషియన్ల నైపుణ్యం పెంపుకై మెడ్‌ట్రానిక్- ఫిలిప్స్ భాగస్వామ్యం

ఐవీఆర్
మంగళవారం, 11 మార్చి 2025 (17:19 IST)
వైద్య సాంకేతికతలో అగ్రగామి అయిన మెడ్‌ట్రానిక్, ఆరోగ్య సాంకేతికతలో అగ్రగామి అయిన ఫిలిప్స్, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్ కోసం అధునాతన ఇమేజింగ్ టెక్నిక్‌లపై కార్డియాలజిస్టులు, రేడియాలజిస్టులకు అవగాహన కల్పించడానికి, శిక్షణ ఇవ్వడానికి భారతదేశంలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా ఎండ్-స్టేజ్ రీనల్ డిసీజ్ (ఈఎస్ఆర్డీ) రోగులకు సేవలందించడంలో ఎకోకార్డియోగ్రఫీ (ఎకో), మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) వంటి మల్టీ-మోడాలిటీ ఇమేజింగ్‌లో 300 మందికి పైగా వైద్యుల నైపుణ్యాన్ని పెంచడాన్ని ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది,.
 
ఈ శిక్షణ కార్యక్రమం ప్రఖ్యాత అంతర్జాతీయ, భారతీయ నిపుణుల మార్గదర్శకత్వంలో ఫిలిప్స్ అత్యాధునిక అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ వ్యవస్థలపై అందించే ఆచరణాత్మక అనుభవంతో కూడిన బోధనా సెషన్‌లను మిళితం చేస్తుంది. ఈ విద్యాత్మక వర్క్‌షాప్‌లకు సంబంధించి స్ట్రక్చరల్ హార్ట్ విధానాలలో స్పెషలైజేషన్ కలిగిన 15 కీలక వైద్య సంస్థలు గుర్తించబడ్డాయి. 
 
ఈ భాగస్వామ్యం గురించి మెడ్‌ట్రానిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ మన్దీప్ సింగ్ కుమార్ మాట్లా డుతూ, "ఈ వినూత్న శిక్షణా కార్యక్రమాన్ని అమలులోకి తీసుకురావడానికి ఫిలిప్స్‌తో భాగస్వామ్యం కుదుర్చు కోడానికి మేం సంతోషిస్తున్నాం. ఈ భాగస్వామ్యం రోగుల ఫలితాలను మెరుగుపరచడంలో, ముఖ్యంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, ఈఎస్ఆర్డీ ఉన్నవారికి మా నిరంతర నిబద్ధతలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచి స్తుంది. ప్రత్యేక శిక్షణ, అధునాతన ఇమేజింగ్ పరిష్కారాలను అందించడం ద్వారా, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు టీఏవీఐ (ట్రాన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్) విధానాల కచ్చితత్వాన్ని పెంచడానికి, అంతిమంగా రోగి సంరక్షణను మెరుగుపరచడానికి అవసరమైన సాధనాలతో సన్నద్ధం చేయడమే మా లక్ష్యం’’ అని అన్నారు.
 
"ఫిలిప్స్‌లో, మేం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎక్కువ మందికి మెరుగైన సంరక్షణను అందించడంపై కేంద్రీకృతమై ఉంటుంది. మెడ్‌ట్రానిక్‌తో ఈ భాగస్వామ్యం మా లక్ష్యం వైపు మరో అడుగు. భారతదేశం అంతటా స్ట్రక్చ రల్ హార్ట్ ఇమేజింగ్‌లో వినూత్నత, విద్యపై దృష్టి పెట్టడం ద్వారా, నిరంతర అభ్యాసం ద్వారా మల్టీ-మోడాలిటీ ఇమేజింగ్‌లో వేగవంతమైన పురోగతిని పరిష్కరించడం మా లక్ష్యం. ఎకోకార్డియోగ్రఫీ, ఎంఆర్ఐ వంటి అధునాతన పద్ధతులతో వైద్యులను శక్తివంతం చేయడం మా లక్ష్యం. ఇది ముఖ్యంగా ఈఎస్ఆర్డీ రోగులకు మరింత కచ్చితమైన రోగ నిర్ధారణల, మెరుగైన సంరక్షణ ఫలితాలకు దారితీస్తుంది’’ అని ఫిలిప్స్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ శేష అన్నారు. "భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో, అధిక వ్యాధి భారాన్ని పరిష్కరించడానికి ముందుకు సాగుతున్న కొద్దీ, క్లినికల్ నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి, రోగి సంరక్షణపై అర్థవంతమైన ప్రభా వాన్ని చూపడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని ఆయన అన్నారు.
 
భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ) ప్రబలుతోంది. ఏటా సుమారు 2.2 లక్షల కొత్త ఈఎస్ఆర్డీ కేసులు పెరుగుతున్నాయి. ట్రాన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (టీఏవీఆర్) సమయంలో అయోర్టిక్ స్టెనోసిస్ ఉన్న ఈఎస్ఆర్డీ రోగులలో 9.5% మంది అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీల నుండి ప్రయోజనం పొంద వచ్చని ప్రపంచ అధ్యయనాలు సూచిస్తున్నందున, అధునాతన రోగనిర్ధారణ పరిష్కారాలు, వైద్యులకు ప్రత్యేక శిక్షణ అవసరం.
 
మెడ్‌ట్రానిక్ ట్రాన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (టీఏవీఆర్) వ్యవస్థ ఇటీవల ఒక ముఖ్యమైన మైలు రాయిని వేడుక చేసుకుంది: 2004లో దీని మొదటి మానవ ప్రక్రియ జరిగి 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ మైలురాయి విజయం హృదయనాళ సంరక్షణ రంగంలో నిరంతర వినూత్నత, వాణిజ్యీకరణకు మెడ్‌ట్రానిక్ అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతుంది. గత రెండు దశాబ్దాలుగా, మెడ్‌ట్రానిక్ భారతదేశంలో అనేక విప్లవాత్మక టీఏవీఆర్ వ్యవస్థలను ప్రవేశపెట్టింది. మినిమల్లీ ఇన్వాసివ్ హార్ట్ వాల్వ్ రీప్లేస్‌మెంట్   సరిహద్దులను నిరంతరం అధిగమిస్తోంది, రోగి ఫలితాలను మెరుగుపరుస్తోంది.
 
త్రీడీ ట్రాన్స్‌సోఫాగియల్ ఎకోకార్డియోగ్రఫీ (3D TEE), ఎంఆర్ఐ నుండి పొందిన డేటాను ఉపయోగించి బృహద్ధమని శరీర నిర్మాణ శాస్త్రాన్ని విశ్లేషించగల ఫిలిప్స్ ఏఐ-ఆధారిత సాఫ్ట్‌వేర్, రేడియోప్యాక్ కాంట్రాస్ట్ ఏజెంట్ల అవసరాన్ని తొలగిస్తుంది. కాంట్రాస్ట్ ఏజెంట్లు నెఫ్రోటాక్సిక్ కావచ్చు. అవి ఈఎస్ఆర్డీ రోగులలో మూత్రపిండాల పనితీరు మరింత క్షీణించే ప్రమాదాన్ని కలిగిస్తాయి కాబట్టి, ఈ ఆవిష్కరణ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడ టానికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వైద్యులు ప్రత్యామ్నాయ ఇమేజింగ్ విధానాలను ఉపయోగించ డానికి వీలు కల్పించడం ద్వారా, భాగస్వామ్యం ఈ రోగుల జీవిత కాలవ్యవధి, జీవన నాణ్యత రెండింటినీ గణనీ యంగా మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా వుమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది : కిరణ్ అబ్బవరం

ల్యాంప్ సినిమా నచ్చి డిస్ట్రిబ్యూటర్లే రిలీజ్ చేయడం సక్సెస్‌గా భావిస్తున్నాం

''బాహుబలి-2'' రికార్డు గల్లంతు.. ఎలా?

వీర ధీర సూరన్ పార్ట్ 2 లవ్ సాంగ్ లో నేచురల్ గా విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ

ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా అంటూ చిరంజీవి పలుకరించడంతో ఆశ్చర్యపోయా : హీరో నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments