Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలస్యంగా రావడంలో ఆ రైలు ఫస్ట్...

దేశంలో నడిచే రైళ్లు సమయానికి రావు అనే అపవాదు ఉంది. దీన్ని మరింతగా రుజువు చేసేలా ఓ ట్రైన్ ఏకంగా సగటున 11 గంటల పాటు ఆలస్యంగా నడుస్తుంది. వారంలో ఒక్కరోజు నడిచే ఈ రైలు ప్రతి వారంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇ

Webdunia
సోమవారం, 10 జులై 2017 (15:23 IST)
దేశంలో నడిచే రైళ్లు సమయానికి రావు అనే అపవాదు ఉంది. దీన్ని మరింతగా రుజువు చేసేలా ఓ ట్రైన్ ఏకంగా సగటున 11 గంటల పాటు ఆలస్యంగా నడుస్తుంది. వారంలో ఒక్కరోజు నడిచే ఈ రైలు ప్రతి వారంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇంతకీ ఆ రైలు పేరు తెలుసుకోవాలని ఉంది కదా. అది మండ్వాడీ-రామేశ్వ‌రం వీక్లీ ఎక్స్‌ప్రెస్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మండ్వాడీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంకు వారంలో ఒక్కసారి నడుస్తుంది. ఆ ఒక్కసారి కూడా సగటున 11 గంటల 5 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తుంది.
 
ఈ రైలు 2790 కిలోమీటర్లు పట్టాలపై పరుగెత్తాల్సి ఉంది. 35 స్టేషన్లలో ఆగి వెళ్తుంది. దీంతో గమ్య స్థానానికి చేరుకునేందుకు నాలుగు రోజుల సమయం పడుతుంది. ప్రతి ఆదివారం రాత్రి 21.00 గంటలకు మండ్వాడీలో బయలుదేరే ఈ రైలు రామేశ్వరానికి గురువారం అర్థరాత్రి 00.40 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు సగటు వేగం 54 కిలోమీటర్లు కాగా గరిష్ట వేగం 110 కిలోమీటర్లు. మొత్తం ట్రావెల్ సమయం 51 గంటల 40 నిమిషాలు. 
 
అందుకే దేశంలో ఆలస్యంగా నడిచే రైళ్ళలో ఈ రైలు మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. ఆ తర్వాత స్థానంలో ప‌శ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి జ‌మ్ముతావి వ‌ర‌కు వెళ్లే హిమ‌గిరి సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రెండో స్థానంలో ఉంది. దీని స‌రాసరి లేటు 9.3 గంట‌లు. అలాగే అమృత్‌స‌ర్ నుంచి బీహార్‌లోని ద‌ర్భంగా వెళ్లే జ‌న నాయ‌క్ ఎక్స్‌ప్రెస్ 8.9 గంట‌ల స‌రాస‌రి లేటుతో మూడో స్థానంలో నిలిచింది. 
 
దేశ వ్యాప్తంగా ఆలస్యంగా నడిచై రైళ్ళపై ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో దాదాపు 2 కోట్ల మంది వరకు పాల్గొన్నారు. ఇకపోతే.. ప్ర‌యాణికుల‌కు బాగా ఇష్ట‌మైన రైల్వే స్టేష‌న్లుగా వ‌డోద‌ర‌, హౌరా, నాగ్‌పూర్ స్టేష‌న్లు నిలిచాయి. ఆహారం విష‌యంలో క‌ర్ణాట‌క‌లోని దేవ‌న‌గ‌ర జంక్ష‌న్‌కి, అహ్మ‌దాబాద్‌-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్‌కి ప్ర‌యాణికులు మొద‌టి ర్యాంకు ఇచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments