Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకిన్ ఇండియా అంటే దేశంలో తయారయ్యే ఫోన్లపై పన్నులా.. హవ్వ..

దేశమంతా వస్తుసేవలపై ఒకే రకం పన్నులు విధించడానికి వీలు కల్పిస్తున్న జీఎస్టీ వల్ల మేకిన్ ఇండియా భావనకే ఎసరు వచ్చే ప్రమాదం వస్తోందా.. కనీసం మొబైల్ ఉత్పత్తుల రంగంలో ఇది కరెక్టే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎదుకంటే వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని ప్రభుత్వం

Webdunia
శనివారం, 20 మే 2017 (05:48 IST)
దేశమంతా వస్తుసేవలపై ఒకే రకం పన్నులు విధించడానికి వీలు కల్పిస్తున్న జీఎస్టీ వల్ల మేకిన్ ఇండియా భావనకే ఎసరు వచ్చే ప్రమాదం వస్తోందా.. కనీసం మొబైల్ ఉత్పత్తుల రంగంలో ఇది కరెక్టే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎదుకంటే వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని ప్రభుత్వం 12 శాతంగా నిర్ణయించడంతో చాలా వరకు మొబైల్ ఫోన్లు మరింత ప్రియం కానున్నాయి. దీంతో స్థానికంగా మొబైల్స్ తయారుచేసే కంపెనీలకు ప్రభుత్వం ఇంటెన్సివ్‌లు ప్రకటించి ‘మేకిన్ ఇండియా’కు ఊతం ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ తయారీదారులైన ఫాక్స్‌కాన్ లాంటి కంపెనీలకు ఇది ఎంతో అవసరమని అభిప్రాయపడుతున్నారు. 
 
తాజా జీఎస్‌టీ రేటు ప్రకారం దిగుమతి చేసుకున్న ఫోన్లు చవగ్గా లభించనుండగా భారత్‌లో తయారయ్యే ఫోన్లు మరంత ఖరీదు కానున్నాయి.
జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలో 5.9 కోట్ల ఫోన్లు అమ్ముడు కాగా అందులో 80 శాతం ఫోన్లు స్థానికంగా తయారైనవే. గతేడాది 26.5 కోట్ల ఫోన్లు అమ్ముడు పోగా అందులో 65 శాతం స్థానికంగా తయారు చేసినవే కావడం గమనార్హం. 
 
దీంతో స్థానికంగా తయారైన ఫోన్లు, దిగుమతి చేసుకున్న ఫోన్ల మధ్య వ్యత్యాసం చూపేందుకు మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీని విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూలై 1 నుంచే కొత్త జీఎస్‌టీ విధానం అమల్లోకి రానుండడంతో ఆలోపే ఈ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని తయారీ పరిశ్రమ కోరుతోంది.
 
గురువారం రాత్రి జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం సెల్యులార్, ఇతర వైర్‌లెస్ నెట్‌వర్క్ కోసం తయారుచేసే టెలిఫోన్లు, విడిభాగాలకు 12 శాతం పన్నురేటు విధించారు. ఫలితంగా భారత్ దిగుమతి చేసుకునే ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టగా స్థానికంగా తయారైన ఫోన్ల రేట్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
 
ఇదెలా సాధ్యం అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయించే ఫోన్ల సుంకం 17 శాతం నుంచి 27 శాతంగా ఉంది. ఇప్పుడది 12 శాతానికి తగ్గింది. దీనివల్ల దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా భారత్‌లో తయారుచేసి విక్రయించే ఫోన్లు మాత్రం వ్యాట్‌తో కలపుకుని 7.5-8 శాతం నుంచి 17 శాతం మధ్యలో ఉంది. అంటే తేడా 5 శాతం నుంచి 14.5 శాతం. ఇప్పుడది 12 శాతం అయింది. అంటే ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందన్నమాట. కాగా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు విక్రయించే ఫోన్లు ఇక ముందు మరింత కాస్ట్‌లీ కానున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
 
అందుకే జూలై 1లోపే మొబైల్ కొనుక్కోండి.. ఆ తర్వాత కొనలేరు అనే ప్రచారం బాగా పుంజుకుంటోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, ప్ర‌వ‌ర్త‌న కూడా ఉండాలి.. ప‌రిస్థితుల‌ను అనుకూలంగా ఎదిగా: మెగాస్టార్ చిరంజీవి

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments