Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు కొనుక్కోండి... ఓ యేడాది తర్వాత డబ్బు చెల్లించండి.. కరోనా ఆఫర్!

Webdunia
బుధవారం, 20 మే 2020 (09:34 IST)
కరోనా దెబ్బకు ప్రతి రంగం కుదేలైంది. ముఖ్యంగా, ఆటో మొబైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. దీంతో సూపర్ ఆఫర్లతో ఆటో మొబైల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఇందులోభాగంగా, వివిధ రకాల ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా ఓ సూపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 
 
కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు వినూత్న ఫైనాన్స్ స్కీములను ప్రకటించింది. కోవిడ్ వారియర్లు అయిన పోలీసులు, వైద్యులకు కొన్ని, సాధారణ వినియోగదారుల కోసం మరికొన్ని ఫైనాన్స్ స్కీములను ప్రకటించింది.
 
వైద్యులు కనుక మహీంద్రా వాహనాన్ని కొనుగోలు చేస్తే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే రుణం మంజూరు చేస్తారు. అలాగే, డబ్బులు చెల్లించేందుకు మూడు నెలల మారటోరియం కూడా ఉంది. వాహనాన్ని ఇప్పుడు తీసుకుని మూడు నెలల తర్వాత డబ్బులు చెల్లించొచ్చు.
 
అదే సాధారణ వినియోగదారులైతే ఏడాది తర్వాతి నుంచి ఈఎంఐ చెల్లించవచ్చు. మహీంద్రా ఎస్‌యూవీలపై వందశాతం ఆన్‌ రోడ్ ఫండింగ్ లభిస్తుంది. అదే, మహిళలు కనుక వాహనం కొనుగోలు చేస్తే 0.1 శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. మూడు నెలలపాటు అతి తక్కువ ఈఎంఐ చెల్లిస్తూ ఆ తర్వాత దానిని పెంచుకునే సౌలభ్యాన్ని కల్పించింది. గరిష్టంగా 8 ఏళ్లపాటు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments