Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై-పూణే రహదారిపై రద్దీ రద్దీ.. హైపర్ లూప్ విధానం వచ్చేస్తోంది..

ముంబై-పూణే రహదారిపై వాహన రద్దీని తగ్గించేలా రెండు నగరాల మధ్య హైపర్ లూప్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర సర్కారు ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా... హైపర్ లూప్ విధానంలో 25 నిమిషాల్లో

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (12:43 IST)
ముంబై-పూణే రహదారిపై వాహన రద్దీని తగ్గించేలా రెండు నగరాల మధ్య హైపర్ లూప్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర సర్కారు ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా... హైపర్ లూప్ విధానంలో 25 నిమిషాల్లో గమ్యానికి చేరుకునే వీలుంది. 
 
ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి రోడ్డు, రైలు మార్గాన్ని ఎంచుకుంటే మూడు గంటల సమయం పడుతుంటే.. హైపర్ లూప్ విధానం ద్వారా అరగంట సమయమే పడుతుంది. ఇంకా హైపర్ లూప్ ఏర్పాటు కోసం యూఎస్‌‍కు చెందిన వర్జిన్ హైపర్ లూప్ వన్ సంస్థను సంప్రదించామని మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. 
 
ప్రస్తుతం అమెరికాలో ఉన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, నెవడాలో ఉన్న వర్జిన్ హైపర్ లూప్ వన్ టెస్ట్ సైట్ ను సందర్శించారని, కంపెనీ సీఈఓ రాబ్ లాయిడ్‌తో ఆయన చర్చించారని మహారాష్ట్ర సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో అతి త్వరలోనే హైపర్ లూప్‌పై అధ్యయనం చేసేందుకు సంస్థ ఇంజనీర్లు భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే 15 కిలోమీటర్ల  హైపర్ లూప్ ట్రాక్‌‌కోసం ది పూణే మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎమ్ఆర్డీఏ) గుర్తించిందని.. ఈ హైపర్ లూప్ కోసం 70శాతం వస్తువులు మహారాష్ట్రలోనే వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments