Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ బాదుడు : రాయితీ సిలిండరుపై రూ.50 పెంపు - ఇకపై ప్రతి 15 రోజులకోసారి...

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (07:08 IST)
వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్‌ ధర ప్రతిరోజూ పెరుగుతూ రూ.100కు చేరువగా వెళ్తున్న వేళ.. సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు పెంచాయి. 
 
దేశంలో పెట్రోలు ధరలు సెంచరీకి చేరువైన వేళ.. గ్యాస్ సిలిండరుపై మరో రూ.50 పెంచాయి. ఈ బాదుడుతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. ఈ నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండరు ధర రూ.769కి చేరింది. ఈ పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయట.
 
దేశంలో అసలే పెట్రోలు ధరలు పెరుగుదలతో సామాన్యుడి జేబు చినిగిపోతోంది. రోడ్డుపైకి బైక్‌పై వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉన్నా సరే మన జేబు సురక్షితం కాదని చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో తేలిపోయింది. 

అంతేకాకుండా, ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి గ్యాస్ ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలు సవరిస్తున్న ప్రభుత్వం అదే విధానాన్ని గ్యాస్‌పైనా అమలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగానే నేటి నుంచి ధరల పెంపు అమలు మొదలుపెట్టింది. అంటే మరో 15 రోజుల తర్వాత మరోమారు బాదుడు ఉంటుందన్న మాట.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments