Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన సిలిండర్ ధరలు.. ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:50 IST)
సిలిండర్ ధరలు పెరిగాయి. సాధారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన చమురురంగ సంస్థలు సవరిస్తాయి. తాజాగా, చమురు రంగ కంపెనీలు 14.2 కిలోల సిలిండర్ పైన రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు ఫిబ్రవరి 4వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధర రూ.6 మాత్రమే పెరిగింది. ఇవి ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి.
 
రేట్ల పెంపు నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.719కు చేరుకుంది. ఇదివరకు ఇంతకుముందు రూ.694గా ఉంది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.746.50 నుంచి రూ.771.5కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.777కు చేరింది.
 
తాజా పెంపుతో లక్నోలో రూ.757, నోయిడాలో రూ.717, కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735, బెంగళూరులో రూ.722, హైదరాబాద్‌లోని రూ.771.50కు చేరాయి. 
 
గత ఏడాది డిసెంబర్ నెలలో చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలు పెంచగా, ఈ ఏడాదిలో తొలిసారిగా గ్యాస్‌ ధరలు పెరిగాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్స్ డెలివరీ చేసేందుకు మరో రూ.30 వరకు తీసుకోవచ్చు. అంటే సిలిండర్‌కు రూ.800కు పైగా తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments