Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్టూ, బులియన్ మార్కెట్టూ... పెట్రోల్ మార్కెట్టూ... ఇక రోజూ బాదుడే..

స్టాక్ మార్కెట్టు, బులియన్ మార్కెట్ ఎలా అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రతిరోజూ మారుతుంటాయో, ధరలు నిత్యం పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయో ఇకమీదట దేశంలో పెట్రోలు, డీజెల్ ధరలు కూడా రోజూ మారుతూ ఉంటాయని చమురు కంపెనీలు తాఖీదు ఇచ్చేశాయి. ఇప్పటిలా ప్రతి 15 రోజు

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (04:34 IST)
స్టాక్ మార్కెట్టు, బులియన్ మార్కెట్ ఎలా అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రతిరోజూ మారుతుంటాయో, ధరలు నిత్యం పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయో ఇకమీదట దేశంలో పెట్రోలు, డీజెల్ ధరలు కూడా రోజూ మారుతూ ఉంటాయని చమురు కంపెనీలు తాఖీదు ఇచ్చేశాయి. ఇప్పటిలా ప్రతి 15 రోజులకు ఒకసారి చమురు ధరలను మారుస్తుండటం కాకుండా ప్రతి రోజూ ధరలు పెరిగే, తగ్గే విధానం త్వరలో అమలులోకి వచ్చేస్తోంది. రోజూ ధరలను సమీక్షిస్తూ దానికి అనుగుణంగా కస్టమర్లకు అందిస్తుంటే చమురు కంపెనీలపై రాజకీయ ఒత్తిడికి ఏమాత్రం తావుండదనే ఆలోచనతో ఈ సరికొత్త విధానాన్ని తీసుకువస్తున్నారు. 
 
‘ఎట్టకేలకు రోజూ చమురు ధరలు సమీక్షించే విధానంవైపు అడుగులు పడుతున్నాయి. తొలుత విశాఖపట్నం, ఉదయ్‌పూర్‌ (రాజస్థాన్‌), జంషెడ్‌పూర్‌ (ఝార్ఖండ్‌), చండీగఢ్‌, పుదుచ్చేరి నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేస్తాం. క్రమంగా దేశం మొత్తానికీ దీన్ని విస్తరిస్తాం’అని ఐవోసీ ఛైర్మన్‌ బి.అశోక్‌ విలేకరులతో చెప్పారు. దేశ వ్యాప్తంగా రోజూ ధరలను సమీక్షించొచ్చు. మొదట కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకొస్తే.. దీని ప్రభావం తెలుస్తుంది. దాన్ని అధ్యయనం చేపట్టిన తర్వాత దేశంలోని మిగతా ప్రాంతాలకూ ఈ విధానాన్ని విస్తరిస్తాం’అని అశోక్‌ వివరించారు. 
 
మే నెల ఒకటో తేదీ నుంచి అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా విశాఖపట్నం సహా ఐదు ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు రోజూ మారనున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ప్రతినెలా ఒకటి, 16వ తేదీల్లో ఈ ధరలను సమీక్షిస్తున్నారు. మునుపటి 15 రోజుల అంతర్జాతీయ చమురు ధరల సగటు, విదేశీ మారకపు రేటుల ఆధారంగా మార్పులు చేస్తున్నారు.
 
జూన్‌ 2010లో పెట్రోలు, అక్టోబరు 2014లో డీజిలు ధరలను సమీక్షించే అధికారాలను కేంద్రం చమురు సంస్థలను బదిలీచేసింది. ఈ సంస్థల మధ్య ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తుంటాయి. రోజూ ధరలను సమీక్షించడంతో ధరల పెంపు ప్రభావం కనిపించదని, రాజకీయ ఒత్తిడికీ తావుండదని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. 
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments