Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.బి.ఐ కార్డు సహకారంతో లక్ష్మీ విలాస్ బ్యాంక్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2015 (18:44 IST)
ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన లక్ష్మీ విలాస్ బ్యాంకు తమ ఖాతాదారుల కోసం తొలిసారి క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఈ బ్యాంకుకు కేవలం డెబిట్ కార్డు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఎస్.బి.ఐ కార్డు సహకారంతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. మంగళవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కార్డును ఎస్.బి.ఐ కార్డు సీఈఓ విజయ్ జషువా, లక్ష్మీ విలాస్ బ్యాంకు సీఓఓ (క్రెడిట్ కార్డు) విద్యాసాగర్‌లు కలిసి ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా వారిద్దరు విలేకరులతో మాట్లాడుతూ ఎస్.బి.ఐ కార్డుతో కలిసి లక్ష్మీ విలాస్ బ్యాంకు కో-బ్రాండెట్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని చెప్పారు. ఈ కార్డును రెండు రకాలుగా ప్రవేశపెట్టారు. వీటిలో ఒకటి వీసా ప్లాటినం కార్డు కాగా, మరొకటి వీసా సింప్లీ సేవ్ కార్డు అని చెప్పారు. ఈ కార్డుల ద్వారా వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ కార్డులను చిప్ బేస్డ్‌గా తయారు చేసి హై సెక్యూరిటీ టిప్స్‌తో రూపొందించినట్టు తెలిపారు. సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు క్రెడిట్ లిమిట్ రూ.2 లక్షలు కాగా, ప్లాటినం కార్డు క్రెడిట్ లిమిట్ రూ.5 లక్షలుగా నిర్ణయించినట్టు వివరించారు.
 
 
ఈ కార్డులు ప్రపంచ వ్యాప్తంగా రెండు మిలియన్ ఔట్‌లెట్లలోనూ, భారత్‌లో సుమారుగా 2.85 లక్షల ఔట్ లెట్లలో అనుమతిస్తారని తెలిపారు. ఈ కార్డు కలిగిన వినియోగదారులు ఫ్యూయల్ సర్‌చార్జి, నగదు విత్‌డ్రా, బిల్ పే ఫెసిలిటీ, ఫ్లెక్సీ పే, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, క్యాష్ బ్యాక్ ఆఫర్, రివార్డ్ పాయింట్స్ తదితర ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి తమ బ్యాంకు ఖాతాదారులకు పదివేల క్రెడిట్ కార్డులను జారీ చేస్తామనే ఆశాభావాన్ని విద్యాసాగర్ వెల్లడించారు. కాగా, ఎస్.బి.ఐ క్రెడిట్ కార్డులు 3.2 మిలియన్లు ఉండగా, ప్రతి యేడాది ఆరు లక్షల కార్డులను జారీ చేస్తున్నట్టు చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments