Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానులు ‘కూ పే బోలేగా’ అంటూ బెన్నీ దయాల్ రచించిన కూ క్రికెట్ గీతం వైరల్‌

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (22:01 IST)
కొనసాగుతున్న క్రికెట్ అనుభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు, కూ (Koo) యాప్ ఒక ఉత్తేజకరమైన క్రికెట్ గీతం- కూ పే బోలేగాను ప్రారంభించింది. టీ20 ప్రపంచ కప్ 2021 సమయంలో ఇది టీమ్ ఇండియా కోసం ఉత్సాహంగా అభిమానుల ఉల్లాసం, ఉత్సాహం మరియు తీవ్రమైన శక్తితో ప్రతిధ్వనిస్తుంది.
 
ప్రముఖ గాయకుడు బెన్నీ దయాల్ కంపోజ్ చేసి, పాడిన హై-ఆక్టేన్ గీతం సోషల్ మీడియాలో అభిమానుల ఊహలను కైవసం చేసుకుంది. బెన్నీ దయాల్ ఫాలోవర్లు ఈవారం ప్రారంభంలో గీతం ప్రారంభించినప్పటి నుండి ప్లాట్‌ఫారమ్‌ పై గాయకుడితో కూ చేస్తూ మరియు నిమగ్నమై ఉన్నారు. బెన్నీ దయాల్‌ 16 భాషల్లో 2,000 పాటలు పాడారు. కూ కోసం ఈ గీతం భారతీయ భాషల్లోని యూజర్ల  ప్రతిస్పందనలతో ప్రతిధ్వనిస్తోంది.
 
క్రికెట్ గీతం వీడియోను పంచుకుంటూ గాయకుడు ఇలా చేసారు, “క్రికెట్ ఫీవర్ ఉంది! మరోసారి, నీలం రంగులో ఉన్న పురుషులను ఉత్సాహపరిచేందుకు మేము మా స్క్రీన్‌లకు అతుక్కుపోయాము. అబ్ చాహే హార్ హో యా జీత్, పూర దేశ్ అప్నే ఛాంపియన్స్ కే లియే #KooParBolega కూ గీతం కే సాథ్. జోష్ కామ్ నా హో, ఈ సీజన్‌ లోని అత్యంత ఆకర్షణీయమైన ట్రాక్‌‌తో బిగ్గరగా ఉత్సాహాన్ని ఇద్దాం మరియు గీతంపై మీ కదలికలతో నాతో చేరండి! "
 
కూ (koo) ప్రతినిధి మాట్లాడుతూ, “ప్రతి భారతీయుడిని వారి మాతృభాషలో కనెక్ట్ చేయడమే లక్ష్యంగా చేసుకున్న మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌‌గా భారతదేశం జరుపుకునే ప్రతిదాన్ని మేము తెలియజేస్తున్నాము. మనకు క్రికెట్ అనేది ఒక భావోద్వేగం, ఇది ఆనందాన్ని కలిగించే వ్యక్తీకరణ. ఎంతో ప్రతిభావంతుడైన బెన్నీ డయాల్ మన క్రికెట్ గీతాన్ని అత్యంత అద్భుతమైన రీతిలో కంపోజ్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గీతం మా TVC ప్రచారం, కూ (Koo) క్రియేటర్ కప్ మరియు లెజెండరీ క్రికెటర్ల రియల్-టైం వ్యాఖ్యానంతో పాటు, #KooKiyaKya ద్వారా నిమగ్నమై, కనెక్ట్ అయినప్పుడు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments