Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైవిధ్యమైన డిజైన్‌తో కూడిన సెల్టోస్‌ వార్షికోత్సవ ఎడిషన్‌ను ఆవిష్కరించిన కియా

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (18:11 IST)
కియా మోటార్స్‌ కార్పోరేషన్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్‌ ఇండియా నేడు కియా సెల్టోస్‌ వార్షికోత్సవ ఎడిషన్‌ను దేశంలో కియా సెల్టోస్‌ విడుదలై ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసింది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ కియా సెల్టోస్‌ ప్రత్యేకంగా హెచ్‌టీఎక్స్‌ ట్రిమ్‌లో ఉత్సాహపూరితమైన ప్రారంభ ధర 13,75,000 రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌, భారతదేశం)లో లభ్యమవుతుంది.
 
కియా సెల్టోస్‌ వార్షికోత్సవ ఎడిషన్‌, సాధారణ సెల్టోస్‌తో పోలిస్తే ఎన్నో ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ మార్పులతో వస్తుంది. దీనిలో సిల్వర్‌ డిఫ్యూజర్‌ ఫిన్స్‌తో టస్క్‌ ఆకృతి స్కిడ్‌ ప్లేట్‌, టాంగరిన్‌ ఫాగ్‌ ల్యాంప్‌ బీజెల్‌ ; టాంగరిన్‌ సెంటర్‌ క్యాప్‌, 17 అంగుళాల రావెన్‌ బ్లాక్‌ అల్లాయ్‌ వీల్స్‌, బ్లాక్‌ ఒన్‌ టోన్‌ ఇంటీరియర్స్‌, హానీకాంబ్‌ ప్యాట్రర్న్‌, ఇంకా మరెన్నో వాటితో రావెన్‌ బ్లాక్‌ లెదరైట్‌ సీట్స్‌ వంటివి ఉన్నాయి. ఇవి మరింత ఆకర్షణీయంగా, ధృడంగా, వైవిధ్యంగా సెల్టోస్‌ను నిలుపుతాయి.
 
ఈ ఎడిషన్‌ సెల్టోస్‌ వాహనాలు, రిమోట్‌ ఇంజిన్‌ స్టార్ట్‌తో మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వెర్షన్‌ కోసం వస్తుంది. అంతేకాదు, ఈ కారు పొడవును సాధారణ సెల్టోస్‌తో పోలిస్తే 60 మిల్లీమీటర్లు పెంచారు. ఈ సెల్టోస్‌ వార్షికోత్సవ ఎడిషన్‌ నాలుగు ఎక్స్‌టీరియర్‌ రంగులు ఏమంటే... ఒక మోనోటోన్‌ అరోరా బ్లాక్‌ పెరల్‌ కలర్‌, మూడు డ్యూయల్‌ కలర్‌ స్కీమ్స్‌- అరోరా బ్లాక్‌ పెరల్‌తో గ్రేసియర్‌ వైట్‌ పెరల్‌; అరోరా బ్లాక్‌ పెరల్‌తో స్టీల్‌ సిల్వర్‌, అరోరా బ్లాక్‌ పెరల్‌తో గ్రావిటీ గ్రే ఉంటాయి.
 
ఈ సందర్భంగా శ్రీ కూఖ్యూన్‌ షిమ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, కియా మోటార్స్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘2019వ సంవత్సరంలో సెల్టోస్‌ను ఆవిష్కరించడమనేది కియాకు ఓ బ్రాండ్‌గా బలీయమైన పునాదిని వేసింది. తమ ప్రీమియం ఫీచర్లు, వైవిధ్యమైన డిజైన్‌, అత్యున్నత నాణ్యత, శక్తివంతమైన ఇంజిన్‌ అవకాశాలతో పాటుగా లీనమయ్యేలా చేసే పనితీరు నూతన బెంచ్‌మార్క్స్‌ను సృష్టించడంతో పాటుగా మిడ్-ఎస్‌యువీ విభాగాన్ని పునర్నిర్వచించింది.
 
భారతదేశంలోని మిడ్‌-ఎస్‌యువీ కొనుగోలుదారుల తీరని కోరికలను తీర్చే రీతిలో అత్యంత జాగ్రత్తగా రూపకల్పన చేసిన కియా సెల్టోస్‌ , అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందడంతో పాటుగా విజయాన్నీ సాధించింది. నేడు, కియా సెల్టోస్‌ వార్షికోత్సవ ఎడిషన్‌‌ను ఆవిష్కరించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఇది దేశంలో కియా సెల్టోస్‌ విజయాన్ని వేడుక చేయడమే కాదు, భారతదేశంలో మా వినియోగదారుల నుంచి అందుకున్న ప్రేమను సైతం వేడుక చేస్తుంది’’ అని అన్నారు.
 
కియా సెల్టోస్‌ ఓ ప్రతిష్టాత్మకమైన  ఉత్పత్తిగా భారతదేశంలో ఆటోమోటివ్‌ డిజైన్‌ను చూసే విధానాన్ని సమూలంగా మార్చింది. సెల్టోస్‌ యొక్క రూపకల్పన శక్తిని వేడుక చేసేందుకు, వార్షికోత్సవ ఎడిషన్‌ ఇప్పుడు సిల్వర్‌ డిఫ్యూజర్‌ ఫిన్స్‌తో టస్క్‌ ఆకృతి స్కిడ్‌ ప్లేట్‌,  సిల్వర్‌ డిఫ్యూజర్‌ ఫిన్స్‌తో రావెన్‌ బ్లాక్‌ రియర్‌ స్కిడ్‌ ప్లేట్‌, టాంగరిన్‌ ఫాగ్‌ ల్యాంప్‌ బీజెల్‌; టాంగరిన్‌ డ్యూయల్‌ మఫ్లర్‌ డిజైన్‌, టాంగరిన్‌ ఇన్సర్ట్స్‌, సెల్టోస్‌ లోగోతో సైడ్‌ సిల్‌; 17 అంగుళాల రావెన్‌ బ్లాక్‌ అల్లాయ్‌ వీల్స్‌, టాంగరిన్‌ సెంటర్‌ వీల్‌ క్యాప్‌ వంటివి దీని కఠినమైన, సాహసోపేత ప్రదర్శనను అందిస్తూనే దీని స్వభావం ప్రదర్శిస్తుంది.
 
ఈ వార్షికోత్సవ ఎడిషన్‌ సెల్టోస్‌ ఇంటీరియర్స్‌ బ్లాక్‌ ఒన్‌ టోన్‌ ఇంటీరియర్స్‌తో మరింతగా వృద్ధి చేయడంతో పాటుగా రావెన్‌ బ్లాక్‌ లెదర్‌ సీట్లు హానీకాంబ్‌ ప్యాట్రర్న్‌తో కారుకు ధృడమైన లుక్‌ను లోపల కూడా అందిస్తుంది. ఎక్స్‌టీరియర్‌ పరంగా, సెల్టోస్‌ వార్షికోత్సవ ఎడిషన్‌ కారు పొడవు సాధారణ సెల్టోస్‌తో పోలిస్తే 60 మిల్లీమీటర్లు వృద్ధి చేయబడింది. ఇది వాహనానికి విస్తృత శ్రేణి లక్షణాలను అందిస్తుంది. అదనంగా, ఈ స్పెషల్‌ ఎడిషన్‌ యొక్క వాహనదారులు ఈ ప్రత్యేకమైన కారుపై మొదటి వార్షికోత్సవ బ్యాడ్జ్‌ను కారు వెనుక భాగంలో సగర్వంగా ప్రదర్శించవచ్చు. కియా సెల్టోస్‌ వార్షికోత్సవ ఎడిషన్‌ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్స్‌లో లభ్యమవుతుంది. వైవిధ్యమైన స్మార్ట్‌ స్ట్రీమ్‌ పెట్రోల్‌ 1.5 ను సిక్స్‌స్పీడ్‌ మాన్యువల్‌, ఐవీటీ ట్రాన్స్‌మిషన్స్‌తో, సమర్థంతమైన డీజిల్‌ 1.5 సీఆర్‌డీఐ వీజీటీను సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌తో మిళితం చేశారు.
 
ఆవిష్కరించిన అనతి కాలంలోనే అపూర్వ విజయం అందుకున్న సెల్టోస్‌తో కియా మోటార్స్‌ ఇండియా పూర్తిగా భారతీయ ఆటోమొబైల్‌  పరిశ్రమలో వైవిధ్యతను తీసుకువచ్చింది. ఈ కంపెనీ ఈ ప్రత్యేక ఎడిషన్‌ను సెల్టోస్‌ సాధించిన ఈ అసాధారణ విజయాన్ని వేడుక చేయడంతో పాటుగా కారులో ఎన్నో సరికొత్త ఫీచర్లనూ జోడించుకుంది. నాణ్యత, డిజైన్‌ పరంగా కియా సెల్టోస్‌ విప్లవాత్మక ఉత్పత్తిగా నిలువడంతో పాటుగా దేశంలోని మిడ్-ఎస్‌యువీ విభాగాన్ని సమూలంగా తమ అత్యున్నత శ్రేణి ఆఫరింగ్‌ మరియు ఈ విభాగాన్ని సమూలంగా ఫీచర్లతో మార్చింది. కియా సెల్టోస్‌కు అపూర్వమైన స్పందన దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి రావడంతో పాటుగా ఒక్క సంవత్సరం లోపుగానే ఒక లక్ష యూనిట్ల విక్రయాల మార్కును సైతం అధిగమించింది. భారతదేశంలో టెక్నాలజీ ప్రియుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దిన సెల్టోస్‌ స్ధిరంగా దేశంలో అత్యుత్తమంగా విక్రయించబడుతున్న మిడ్‌–ఎస్‌యువీగా నిలిచి వినియోగదారులకు సాటిలేని ఆనందాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments