Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50వేలకు మించి బంగారం కొనుగోలు చేస్తే పాన్ కార్డ్ తప్పనిసరి..

ప్రస్తుతం రూ.2లక్షలకు మించి బంగారం కొంటే కేవైసీ వివరాలు అందించాల్సి ఉంది. అయితే ఇకపై ఆ పరిమితి రూ.50వేలకు తగ్గింది. బంగారం కొనుగోలుపై కేంద్రం మరో నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమైంది 50వేల రూపాయలకు మించ

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (12:36 IST)
ప్రస్తుతం రూ.2లక్షలకు మించి బంగారం కొంటే కేవైసీ వివరాలు అందించాల్సి ఉంది. అయితే ఇకపై ఆ పరిమితి రూ.50వేలకు తగ్గింది. బంగారం కొనుగోలుపై కేంద్రం మరో నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమైంది 50వేల రూపాయలకు మించి బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు తప్పనిసరిగా పాన్ కార్డ్ కలిగి ఉండాలని, పాన్ కార్డు వివరాలు అందజేయాలనే నిబంధనకు కేంద్రం మొగ్గు చూపుతోంది.

బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశముంది. నల్ల ధనాన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. పారిశ్రామికీకరణతో ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. కోటి మంది యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది 20 లక్షల టన్నుల పప్పుధాన్యాలు సేకరించడమే లక్ష్యమన్నారు. నాబార్డు మూల నిధి రూ. 41వేల కోట్లకు పెంచామని రాష్ట్రపతి తెలిపారు. ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామన్నారు.
 
బ్లాక్ మనీ, అవినీతి గణనీయంగా తగ్గాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. స్వచ్ఛ భారత్‌ను ప్రజా ఉద్యమంలా చేపట్టామన్నారు. కోటి 20లక్షల మంది గ్యాస్ సబ్సిడీని వదులుకోవడం ప్రశంసనీయమని కొనియాడారు.

దీన్ దయాళ్ గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా పేదల సంక్షేమానికి ఎన్నో ముఖ్య చర్యలు ప్రభుత్వం చేపడుతోందన్నారు. 26కోట్ల జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేశామన్నారు. బ్లాక్ మనీ, అవినీతి గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. క్యాష్ లెస్ విధానం సమర్ధంగా అమలవుతోందని స్పష్టం చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments