Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైన్‌సెట్స్ తయారీ కోసం చైనా కంపెనీ బిడ్... షాకిచ్చిన ఇండియన్ రైల్వే

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (09:11 IST)
వందే భారత్ కింద భారతీయ రైల్వే శాఖ అత్యాధునిక రైళ్లను నడుపుతోంది. వీటిని మినీ బుల్లెట్ రైళ్లుగా అభివర్ణిస్తున్నారు. ఈ రైళ్ళ కోసం కొత్త ట్రైన్ సెట్స్‌ను భారతీయ రైల్వే తయారు చేస్తోంది. 
 
ఈ విషయం తెలుసుకున్న చైనా కంపెనీ ఒకటి వందేభారత్ ట్రైన్‌సెట్స్ తయారీ ప్రాజెక్టు కోసం బిడ్ దాఖలు చేసింది. ఈ కంపెనీకి భారతీయ రైల్వే షాకిచ్చింది. బిడ్ దాఖలు చేసే అర్హత దానికి లేదంటూ తిరస్కరించింది. 
 
ఈ ప్రాజెక్టు విలువ రూ.1,800 కోట్లు కాగా, ఇందులో భాగంగా 44 ట్రైన్స్ సెట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇండియన్ రైల్వే టెండర్లు ఆహ్వానించగా, బీహెచ్‌ఈఎల్, మేధాసెర్వో డ్రైవ్స్, సీఆర్ఆర్‌సీ-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియాలు బిడ్లు దాఖలు చేశాయి.
 
సీఆర్ఆర్‌సీ-పయనీర్ సంస్థ బీజింగ్‌కు చెందిన సీఆర్ఆర్‌సీ యోగ్జి ఎలక్ట్రిక్ లిమిడెట్, భారత్‌కు చెందిన పయనీర్ ఫిల్-మెడ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. వందేభారత్ ట్రైన్స్ సెట్స్ తయారీ కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే ఆ సంస్థ మూలాలు భారత్‌లో ఉండాలి. 
 
అయితే, సీఆర్ఆర్‌సీ-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియా మూలాలు చైనాలో ఉండడంతో ఆ సంస్థ దాఖలు చేసిన బిడ్‌ చెల్లదని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ రేసులో బీహెచ్‌ఈఎల్, మేధాసెర్వో డ్రైవ్స్ మాత్రమే మిగిలాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments