జాక్ మా ఎక్కడున్నారో చెప్పిన చైనా.. వీడియో కూడా రిలీజ్

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (15:21 IST)
చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రెండు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ అదృశ్యం వెనకు చైనా ప్రభుత్వ హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో చైనా అధికారిక మీడియా బుధవారం ఓ వీడియోను విడుదల చేసింది. జాక్‌మా వందమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఉపాధ్యాయులతో వర్చువల్ భేటీ నిర్వహిస్తున్నారంటూ చైనా అధికారిక మీడియా ఓ వీడియోను రిలీజ్ చేసింది.
 
"కరోనా మహమ్మారి ముగిన తర్వాత మళ్లీ మనం కలుద్దాం" అని ఆ గ్రామీణ ఉపాధ్యాయులతో జాక్ మా అన్న వీడియోను గ్లోబల్ టైమ్స్ చూపించింది. అయితే వ్యాపారవేత్తలు మాత్రం ఈ వీడియోపై కొంత సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా టీవీ షోలకు గానీ, సోషల్ మీడియాకు గానీ జాక్‌మా దూరంగా ఉంటారని వారు పేర్కొంటున్నారు. హఠాత్తుగా జాక్‌మా ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడమేంటని ప్రశ్నిస్తున్నారు.
 
జాక్ మా పబ్లిక్ మీటింగులలో, బహిరంగ కార్యక్రమాల్లో కనపడి. అక్టోబరులో చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై, బ్యాంక్ రెగ్యులేటరీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో జాక్‌ మాపై చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయన వ్యాపారాలపై విచారణకు ఆదేశించింది. అయితే ఆ సమావేశం తరువాత జాక్ మా మళ్లీ బయట ఎక్కడా కనపడలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments