పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు : మరో ఛాన్సిచ్చిన కేంద్రం

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (13:47 IST)
పన్ను చెల్లింపుదారులకు మరోమారు వెసులుబాటు లభించింది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20 సంవత్సర ఆదాయ పన్ను రిటర్న్స్ చెల్లింపు గడువు తేదీన మరోమారు పొడగించింది. ఇది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఊరట కలిగించనుంది. 
 
2019-20 ఆర్థిక సంవత్సరానికి సమర్పించాల్సిన ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల గడువును ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పొడిగించింది. ఆడిట్‌ చేసిన పద్దులు సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) శనివారం నాడు ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. 
 
ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. ప్రతి ఏటా ఐటీ రిటర్నులను జూలై 31లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆడిట్‌ చేసిన పద్దులు సమర్పించాల్సిన వారు అక్టోబరు 31 నాటికి రిటర్నులు ఫైల్‌ చేయాలి. 
 
అయితే, కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల గడువును తొలుత జూలై 31 నుంచి నవంబరు 30 వరకు పొడిగించింది. తాజాగా మరో నెల రోజుల అదనపు సమయం కల్పించింది. 
 
కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల ఫైలింగ్‌కు మరింత సమయమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ పేర్కొంది.
 
అంతర్జాతీయ/నిర్దిష్ట దేశీయ లావాదేవీల రిపోర్టు సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించారు. ఇక ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్టు, అంతర్జాతీయ/నిర్దిష్ట దేశీయ లావాదేవీల రిపోర్టు సమర్పణకు ఈ డిసెంబరు 31 వరకు సమయం కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments