Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన క్లాస్‌మేట్‌ ఇంటరాక్టివ్‌ సిరీస్‌: చిన్నారులలో సృజనాత్మకతను మెరుగుపరచడానికి ఐటీసి ఒరిగామీ నోట్‌బుక్స్‌

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (13:45 IST)
సాటిలేని ఉత్పత్తి నాణ్యత మరియు అభ్యాస, అభివృద్ధి ప్రయాణంలో విద్యార్ధులతో భాగస్వామ్యం చేసుకోవడానికి కట్టుబడిన భారతదేశంలో నెంబర్‌ 1 నోట్‌బుక్‌ బ్రాండ్‌, ఐటీసీ క్లాస్‌మేట్‌ ఇప్పుడు ఒరిగామి నోట్‌బుక్స్‌ విడుదల చేసింది. ఎంగేజ్‌మెంట్‌ ఆధారిత నోట్‌బుక్స్‌ సిరీస్‌, క్లాస్‌మేట్‌ ఇంటరాక్టివ్‌ సిరీస్‌లో ఇది మొదటిది. ‘డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌’కార్యకలాపాల ద్వారా విద్యార్థులు అభ్యసించడాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా  చేసుకుని విడుదల చేసిన ఈ ఒరిగామి నోట్‌బుక్స్‌, విద్యార్థులకు అనుభవపూర్వక అభ్యాసం ద్వారా తమ సృజనాత్మకత మరియు ఊహాగానాలను పెంచుకునేందుకు తోడ్పడతాయి.
 
ప్రపంచవ్యాప్తంగా విద్యను అందించే విధానంలో సమూలమైన మార్పులను ‘డూ ఇట్ యువర్‌సెల్ఫ్‌’ అభ్యాస శైలి అందిస్తుంది. ఇటీవల కాలంలో విడుదల చేసిన అధ్యయనాల ప్రకారం, జీవితకాలపు అభ్యాసానికి స్వీయ–సేవ బోధన మరింత ప్రబలంగా మారుతుందనే నమ్మకం పెరుగుతోంది. ఈ దిశగా, అభ్యాసకులు స్వీయ–బోధన, స్వల్పకాలిక కోర్సులు మరియు బూట్‌ క్యాంప్‌లతో సహా అవకాశాల మోనూ నుంచి వారి విద్యను మెరుగుపరుచుకుంటున్నారు.
 
ఈ ఇంటరాక్టివ్‌ సిరీస్‌ నోట్‌బుక్స్‌, నిరంతర అనుసంధానం, అభ్యాసం, ఇంటరాక్టివిటీ ద్వారా విద్యార్థుల అభ్యాసాన్ని వృద్ధి చేయడం పట్ల ఐటీసీ క్లాస్‌మేట్‌ యొక్క నిబద్ధతను సూచిస్తుంది. ఈ ఒరిగామి నోట్‌బుక్స్‌లో ప్రత్యేకమైన డీఐవై ఒరిగామి షీట్స్‌ భాగంగా ఉంటాయి మరియు వీడియోలు, పోటీలు ద్వారా వినియోగదారుల ఎంగేజ్‌మెంట్‌ను వృద్ధి చేసింది. దీనిని అనుసరించి మరిన్ని వినూత్నమైన ఉత్పత్తి ఆఫరింగ్స్‌ మరియు భాగస్వామ్యాలను రాబోయే నెలల్లో  చేసుకోనున్నాం. ఇది అభ్యాసం మరియు సృజనాత్మకతను యువ వినియోగదారుల నడుమ వృద్ధి చేయనుంది.
 
ఈ ఆవిష్కరణలో భాగంగా, క్లాస్‌మేట్‌ ఇప్పుడు ఒరిగామి చాంఫియన్స్‌ పోటీను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఎనిమిది డిజైన్స్‌ను సేకరించడంతో పాటుగా క్లాస్‌మేట్‌ యొక్క ఫేస్‌బుక్‌ లేదా ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌పై పంచుకోవడం ద్వారా క్లాస్‌మేట్‌ నుంచి ప్రత్యేకమైన బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. క్లాస్‌మేట్‌ ఒరిగామి నోట్‌బుక్స్‌ ఇప్పుడు ఎంపిక చేసిన స్టేషనరీ ఔట్‌లెట్లు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మరియు బిగ్‌బాస్కెట్‌ వద్ద లభ్యమవుతాయి. ఒరిగామి అనేది పేపర్‌ను మడతపెట్టే ఓ కళ. ఇది పిల్లల్లో విజువలైజేషన్‌ నైపుణ్యాలను మెరుగుపరచడానికి, ఊహాతీతను అభివృద్ధి చేయడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. తద్వారా చిన్నారులు తమ సృజనాత్మకతను వృద్ధి చేసుకోవడంలో సహాయపడుతుంది.
 
ఈ ఆవిష్కరణ గురించి శ్రీ వికాస్‌ గుప్తా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ స్టేషనరీ ఉత్పత్తుల వ్యాపార విభాగం, ఐటీసీ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘తమ అత్యున్నత నాణ్యత, సృజనాత్మకత మరియు చూడగానే ఆకట్టుకునే ఉత్పత్తులను అందించడం ద్వారా వినియోగదారులకు ఆనందాన్ని నిర్థారించడానికి ఐటీసీ క్లాస్‌మేట్‌ కట్టుబడి ఉంది. నిరంతర ఆవిష్కరణపై ఐటీసీ దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా, అనుభవపూర్వక జ్ఞానం ద్వారా చిన్నారులు నేర్చుకునేందుకు ప్రోత్సహిస్తున్నాం. తమ ఇంటరాక్టివ్‌ సిరీస్‌ ద్వారా క్లాస్‌మేట్‌ ఇప్పుడు  ఆసక్తి, ఊహాతీతత ద్వారా అభ్యాస విధానాన్ని చిన్నారులు ఆస్వాదించేలా భరోసా కల్పించాలనుకుంటుంది’’ అని అన్నారు.
 
ఫిజికల్‌ నోట్స్‌ నుంచి మరింత అర్థవంతమైన, సంపూర్ణమైన అనుసంధానిత ఉపకరణంగా మారడం వరకూ క్లాస్‌మేట్‌ నోట్‌బుక్‌ ప్రయాణం వ్యూహాత్మకంగా మారడంతో పాటుగా అభ్యాసాన్ని మరింత ఉత్సాహంగా, అనుసంధానితంగా మార్చింది.
 
జాయ్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ను క్లాస్‌మేట్‌ విశ్వసిస్తుంది మరియు అభ్యాసం తప్పనిసరిగా ఉత్సాహపూరితంగా మరియు అనుసంధానిత అనుభవాలను విద్యార్థులకు అందించాలని కోరుకుంటుంది. క్లాస్‌మేట్‌ ఒరిగామి నోట్‌బుక్స్‌ అనేవి ఎక్సర్‌సైజ్‌ నోట్‌బుక్స్‌. రెండు అదనపు ఒరిగామి షీట్స్‌ ఈ నోట్‌బుక్స్‌లో భాగంగా ఉంటాయి. వీటిలో ఉత్సాహపూరితమైన మోడల్స్‌ సైతం ఉండటంతో పాటుగా విద్యార్థులు ఓ నమూనా సృష్టించేందుకు సవివరంగా వివరణలు సైతం ఉంటాయి. ఈ మోడల్స్‌లో ఫైటర్‌ జెట్‌, సమురాయ్‌ హ్యాట్‌, కారు,సింహం, ఏనుగు, పీత, నక్క, జిరాఫీ ఉంటాయి. వీటితో పాటుగా సవివరమైన వీడియోలు సైతం అప్‌లోడ్‌ చేయబడి ఉంటాయి. ఇక్కడ విద్యార్థులు పలు నమూనాలను వీక్షించవచ్చు.
 
ఐటీసీ క్లాస్‌మేట్‌ మరియు పేపర్‌క్రాఫ్ట్‌ బ్రాండ్లు తమ విభాగాలలో మార్కెట్‌ అగ్రగాములుగా వెలుగొందుతున్నాయి. ఇవి అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులతో వినియోగదారులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇవి వైవిధ్యమైన ఆఫరింగ్స్‌తో పాటుగా పర్యావరణ అనుకైల పేపర్‌ను సైతం అందిస్తుంది. ఈ పేపర్‌ను పునరుద్పాక అడవుల ద్వారా సేకరిస్తున్నారు. క్లాస్‌మేట్‌ ఎల్లప్పుడూ తమ సృజనాత్మక ఉత్పత్తి ఆవిష్కరణ ద్వారా అభ్యాస అనుభవాలను వృద్ధి చేయడంపై పెట్టుబడులు పెడుతుంది.
 
రూల్డ్‌ మరియు అన్‌రూల్డ్‌ ఫార్మాట్‌లలో 172 పేజీల ఒరిగామి నోట్‌బుక్‌ ధర 50 రూపాయలు. అమెజాన్‌పై  వినియోగదారులు ఒరిగామి నోట్‌బుక్స్‌ను ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్‌ ఒరిగామి నోట్‌బుక్స్‌ ఇప్పుడు బ్రాండ్‌ యొక్క సొంత వ్యక్తిగత పోర్టల్‌ classmateshop.com వద్ద కూడా లభ్యమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments