Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుజు మోటార్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో సర్వీస్ నెట్వర్క్ విస్తరణ

ఐవీఆర్
శుక్రవారం, 6 జూన్ 2025 (20:31 IST)
కడప: ఆంద్రప్రదేశ్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నములో, ఇసుజు మోటార్స్ ఇండియా ఈరోజు కడపలో ఒక కొత్త అధీకృత సర్వీస్ కేంద్రము, ఎస్. కే. మోటార్స్‌ను ప్రారంభించింది. భాగ్యనగర్ కాలనీలో వ్యూహాత్మకంగా ప్రారంభించబడిన ఈ సర్వీస్ కేంద్రానికి కడప జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు.
 
ఏఎస్‎సి సదుపాయాన్ని ఇసుజు మోటార్స్ ఇండియా నుండి ఉన్నత స్థాయి కంపెనీ అధికారులు, ఇతర ప్రముఖులు ప్రారంభించారు. ఎస్.కె. మోటార్స్ రెండు దశాబ్దాలుగా ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక విశ్వసనీయమైన ఆటోమొబైల్ సర్వీస్ భాగస్వామిగా నిలిచింది. ఇది ఇసుజు వాహనాల కొరకు అంకితభావము కలిగిన, ప్రత్యేకమైన సేవలను అందించడముపై దృష్టి కేంద్రాకరిస్తుంది.
 
శ్రీ. టోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మాకు ఆంద్రప్రదేశ్ ఒక కీలక మార్కెట్‌గా కొనసాగుతోంది. నిరంతరాయ సేవా సహకారాన్ని నిర్ధారించుటకు మేము ఎస్.కే. మోటార్స్‌ను మా కొత్త అధీకృత సర్వీస్ భాగస్వామిగా నియమించాము. ఇసుజు వద్ద మేము దేశవ్యాప్తంగా మా సర్వీస్ నెట్వర్క్ ను విస్తరించుటకు కట్టుబడి ఉన్నాము. వారు తమ యాజమాన్య ప్రయాణములో అభివృద్ధి చెందుతున్న ఇసుజు కమ్యూనిటితో అర్థవంతమైన సంబంధాన్ని పెంచుకొనుటలో వారికి మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము.”
 
శ్రీ. షేక్ కరీముల్లా, డీలర్ ప్రిన్సిపల్ ఎస్‌కే మోటార్స్ ఇలా అన్నారు, “ఇసుజు మోటార్స్ ఇండియాతో భాగస్వామ్యం కలిసినందుకు మేమెంతో గర్విస్తున్నాము. ఈ ప్రాంతములోని వినియోగదారులకు ఇసుజు పద్ధతిలో సర్వీస్ అనుభవాన్ని అందించుటకు కట్టుబడి ఉన్నాము. మాకు గుర్తింపు తెచ్చిన రెండు దశాబ్దాల మా నైపుణ్యము నాణ్యమైన సేవ, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఈ కొత్త అధీకృత సర్వీస్ కేంద్రము మా ప్రయాణములో ఒక ప్రత్యేక మైలురాయి, ఈ ప్రాంతములో సేవలు అందించుటకు మేము ఉత్సాహంగా ఉన్నాము.”
 
ఈ సదుపాయములో తగిన మౌలికసదుపాయాలు ఉన్నాయి. సమర్థవంతమైన, నాణ్యమైన సేవను అందించడాన్ని నిర్ధారించే సుశిక్షితులైన వృత్తి నిపుణులు ఉన్నారు. విశ్వసనీయత, వినియోగదారుడి సంతృప్తిపై దృష్టితో, ఈ కేంద్రము ఈ ప్రాంతములో ఇసుజు యొక్క పెరుగుతున్న ఉనికిని పునరుద్ఘాటిస్తూ, స్థిరమైన, ఆధారపడగలిగిన సేవను అందించుటకు కట్టుబడి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments